Share News

TDP, BJP: ఎన్డీయేలో చేరాలంటూ చంద్రబాబుకు అమిత్ షా, నడ్డా ఆహ్వానం..!

ABN , Publish Date - Feb 08 , 2024 | 07:19 AM

న్యూఢిల్లీ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు.ఈ క్రమంలో టీడీపీ ఎన్డీయేలో చేరాలని అమిత్ షా, నడ్డాలు చంద్రబాబును ఆహ్వానించినట్లు సమాచారం.

TDP, BJP: ఎన్డీయేలో చేరాలంటూ చంద్రబాబుకు అమిత్ షా, నడ్డా ఆహ్వానం..!

న్యూఢిల్లీ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. ఈ క్రమంలో టీడీపీ ఎన్డీయేలో చేరాలని అమిత్ షా, నడ్డాలు చంద్రబాబును ఆహ్వానించినట్లు సమాచారం. అయితే పార్టీలో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలియవచ్చింది. అమిత్ షా నివాసం నుంచి నడ్డా వెళ్లిపోయిన తర్వాత కూడా షా.. బాబుల సమావేశం కొనసాగింది. కాగా గురువారం ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు.

కాగా దేశ, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కలిసి పని చేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు సమాచారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పిలుపు మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. సుమారు గంటపాటు చర్చించుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీయేను బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్‌ షా పేర్కొన్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో కూడా పలు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని, ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ - తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్‌ షా ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో జగన్‌ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తమకు సమాచారం అందిందని కూడా చెప్పినట్లు తెలియవచ్చింది. ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్డీయేను బలోపేతం చేసినట్లుగానే... ఇప్పుడూ సహకరించాలని చంద్రబాబును అమిత్‌షా కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2024 | 07:19 AM