Share News

Perninani: వైసీపీ ఎమ్మెల్యే పేర్నినానిపై కేసు నమోదు.. ఎందుకంటే?

ABN , Publish Date - Apr 10 , 2024 | 12:04 PM

Andhrapradesh: జిల్లాలోని బందరు తాలుకా పోలీస్‌స్టేషన్‌ ముందు వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని, ఆయన అనుచురులు చేసిన హాంగామాపై పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పేర్నినాని, అతని అనుచురులపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఐపీపీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైసీపీ శ్రేణులతో కలిసి బందరు తాలుకా ఎస్ఐ చాణిక్యపై పేర్నినాని దౌర్జన్యానికి దిగారు.

Perninani: వైసీపీ ఎమ్మెల్యే పేర్నినానిపై కేసు నమోదు.. ఎందుకంటే?
YSRCP MLA Perni Nani

కృష్ణా జిల్లా, ఏప్రిల్ 10: జిల్లాలోని బందరు తాలుకా పోలీస్‌స్టేషన్‌ ముందు వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని (YSRCP MLA Perni Nani), ఆయన అనుచురులు చేసిన హాంగామాపై పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పేర్నినాని, అతని అనుచురులపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైసీపీ శ్రేణులతో కలిసి బందరు తాలుకా ఎస్ఐ చాణిక్యపై పేర్నినాని దౌర్జన్యానికి దిగారు. పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీనిపై చిలకలపూడి పీఎస్‌లో తాలుకా పోలీసులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉండగా 144 సెక్షన్‌ను అతిక్రమించారని 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

BRS: బీఆర్‌ఎస్‌కు ప్రమాద ఘంటికలు.. ఏడాది క్రితమే చెప్పినా..


అలాగే ఉద్దేశ్వపూర్వకంగా పోలీస్ స్టేషన్ వద్ద గలాటా సృష్టించారని సెక్షన్ 143 కింద కేసు నమోదు అయ్యింది. సీసీ ఫుటేజ్, ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు సెక్షన్ 427 కింద పేర్ని నాని మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. అలాగే మచిలీపట్నంలో ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లపై కేసు నమోదు అయ్యింది. పోలీస్ స్టేషన్‌లో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, మీర్ అస్ఘర్ అలీ, జవ్వాది రాంబాబు సీసీ ఫుటేజ్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు కార్పొరేటర్లపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో తాలుకా పోలీస్ స్టేషన్ సెంట్రీ కానిస్టేబుల్ హరికృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురు కార్పొరేటర్లపై కేసు నమోదు చేశారు.


అసలేం జరిగిందంటే...

రెండు రోజుల క్రితం ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ సానుభూతిపరులపై 50వ డివిజన్‌కు చెందిన వైసీపీ సానుభూతిపరులు దాడి చేశారు. దీంతో టీడీపీ ఫిర్యాదు మేరకు వైసీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన పేర్నినాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలూకా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఆయన.. ఎస్‌ఐ చాణిక్యతో దురుసుగా ప్రవర్తించారు. నానితో పాటు ఆయన కుమారుడు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారంటూ నిరసనకు దిగారు. టీడీపీకి ఎస్‌ఐ కొమ్ముకాస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద పేర్నినాని హంగామాతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.


ఇవి కూడా చదవండి...

Phone Tapping: రాధాకిషన్‌ రావు‌కు ఈనెల 12 వరకు రిమాండ్ పొడిగింపు

Telangana Politics: వరంగల్‌ బీఆర్ఎస్ అభ్యర్థి అతనేనా?

మరిన్ని ఏపీ వార్తల కోసం....

Updated Date - Apr 10 , 2024 | 01:00 PM