Share News

BV Raghavulu: అసెంబ్లీలో సీఎం జగన్ ఆ ప్రకటన చేయాలి

ABN , Publish Date - Feb 05 , 2024 | 10:19 PM

ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు(BV Raghavulu) అన్నారు.

BV Raghavulu: అసెంబ్లీలో సీఎం జగన్ ఆ ప్రకటన చేయాలి

విజయవాడ: ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు(BV Raghavulu) అన్నారు. సోమవారం నాడు ఎంబీకే భవన్‌లో రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మీడియాతో మాట్లాడుతూ.... ఏ హామీని అమలు చేయకుండా.. నూటికి 97 శాతం హామీలు అమలు చేశామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ కార్మికులు, ఉద్యోగులకిచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలు అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని 3 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేసి మాట నిల‌బెట్టుకోవాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తానని అన్నారని కానీ నేటికి హామీలు అమలు చేయడం లేదన్నారు. విద్యుత్‌ రంగంలోని కాంట్రాక్ట్‌ కార్మికులకు ఇచ్చిన హామీలైన డైరెక్ట్‌ పేమెంట్‌, రెగ్యులరైజేషన్‌ అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని హమాలీలు, ట్రాన్స్‌పోర్టు తదితర అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటుచేయాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.

Updated Date - Feb 05 , 2024 | 10:19 PM