Share News

Chandrababu Naidu swearing in: మరికాసేపట్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం..

ABN , Publish Date - Jun 12 , 2024 | 07:31 AM

Chandrababu Naidu swearing as AP CM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.

Chandrababu Naidu swearing in: మరికాసేపట్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం..
Chandrababu Naidu swearing in

Chandrababu Naidu swearing as AP CM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.

వేలాది మందికి ఆహ్వానం..

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వేలాది మందికి ఆహ్వానాలు పంపించారు. ప్రత్యేక ఆహ్వానితులు, వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేకంగా పాసులు జారీచేశారు. ఈ కార్యక్రమానికి విదేశీ, జాతీయస్థాయి అతిథులు తరలి వస్తున్నారు. దాదాపుగా ఆహూతులంతా మంగళవారం రాత్రికి విజయవాడ చేరుకున్నారు. మరోవైపు భారీ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో సభకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రజలందరికీ సభావేదికపై దృశ్యాలు కనిపించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లు అదుర్స్..

ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. వేదికపై 60 మంది వరకు కూర్చునేలా ఏర్పాటుచేశారు. ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేదిక వెనుక భాగంలో గ్రీన్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశారు. ఆ రూమ్స్‌ని ఆయా ప్రముఖులకు కేటాయించారు. అలాగే, ప్రధానమంత్రి మోదీ కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో గ్రీన్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు, హోంమంత్రి అమిత్‌షా, నడ్డా , ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ గ్రీన్‌ రూమ్‌కు చేరుకుంటారు. ప్రధాని గ్రీన్‌ రూమ్‌కు వెనుకభాగంలో పీఎంవో సిబ్బంది కోసం మరో రూమ్‌ను ఏర్పాటు చేశారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కోసం ఒక గ్రీన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రీన్‌ రూమ్‌ పక్కనే వీవీఐపీల కోసం ఇంకో గ్రీన్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - Jun 12 , 2024 | 07:36 AM