Share News

Pattabhiram: గ్రూప్ 1 ఉద్యోగాల్లో సైతం అక్రమాలకు పాల్పడ్డ జగన్ మాఫియా

ABN , Publish Date - Mar 14 , 2024 | 08:30 PM

ఐదేళ్లలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లల్లో లక్షాలాది కోట్లు దోచుకున్న జగన్ మాఫియా చివరకు గ్రూప్ 1 ఉద్యోగాల్లో సైతం అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ(TDP) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డిపట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రూప్ 1 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్లో అమ్ముకుని హీనపక్షంగా రూ. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

Pattabhiram: గ్రూప్ 1 ఉద్యోగాల్లో సైతం అక్రమాలకు పాల్పడ్డ జగన్ మాఫియా

అమరావతి: ఐదేళ్లలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లల్లో లక్షాలాది కోట్లు దోచుకున్న జగన్ మాఫియా చివరకు గ్రూప్ 1 ఉద్యోగాల్లో సైతం అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ(TDP) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డిపట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రూప్ 1 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్లో అమ్ముకుని హీనపక్షంగా రూ. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రూ. 2.50 కోట్లకు, డీఎస్పీ పోస్టును రూ. 1.50 కోట్లకు అమ్ముకున్నారని చెప్పారు. ఈ కుంభకోణం అంతా సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరక్షన్‌లో ఇంటిలిజెన్స్ డీజీ (నాటి ఏపీపీఎస్సీ సెక్రటరీ) సీతారామాంజనేయులు, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కనుసన్నల్లో జరిగిందని చెప్పారు. గత ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి దక్కాల్సిన ఉద్యోగాలను సైతం బహిరంగ వేలం పెట్టి అమ్ముకోవటం దుర్మార్గమన్నారు. గ్రూప్ - 1 ఉద్యోగాల్లో ఏపీపీఎస్సీ అనేక అవకతవకలకు పాల్పండిదని నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. మెయిన్స్ ఎగ్జామ్ జవాబు పత్రాలను 3 సార్లు వాల్యూయేషన్ చేసి .. వారి అనుచరులకు ఉద్యోగాలు కట్టబెట్టారన్న విషయం హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.ఏపీపీఎస్సీ రూల్ 3(9) ప్రకారం 3 సార్లు వాల్యూయేషన్ చేయటం చట్టవిరుద్ధమని, దీనికి సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలు మాన్యువల్ విధానంలో దిద్దాలని నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఉన్నా..డిజిటల్ మూల్యాంకనం ఎందుకు చేశారని నిలదీశారు. సీతారామాంజంనేయులు ఆధ్వర్యంలో ఒకసారి మాన్యువల్ వాల్యూయేషన్ జరిగాక, తానేమీ తక్కువ తిన్నానా అన్నట్టు గౌతమ్ సవాంగ్ మరో సారి వాల్యూయేషన్ చేయించి తనకు నచ్చిన వారిని ఎంపిక చేశారని అన్నారు. తెలంగాణలో గ్రూప్ 1,2 ఉద్యోగాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే అక్కడి యువత కూకటి వేల్లతో పెకలించివేసిందని చెప్పారు. రేపు జగన్ పరిస్థితి అదే అవుతుందని హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపమ్ స్కామ్ కంటే, తెలంగాణలో జరిగిన టీఎస్పీఎస్సీ కుంభకోణం కంటే ఇది అతి పెద్ద భారీ కుంభకోణమని అన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. దీనిలో సీఎం, గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులు వంటి వారు ఎవరున్నా.. ఎవరినీ వదలబోమని హెచ్చరించారు. బాధ్యులైన వారిని కటకటాల పాలు చేసి మన బిడ్డలకు న్యాయం చేస్తామని కొమ్మారెడ్డిపట్టాభిరామ్ హామీ ఇచ్చారు.

Updated Date - Mar 14 , 2024 | 08:30 PM