Share News

Kollu Ravindra: వైసీపీ ప్రభుత్వ అరాచకాల కారణంగానే చేనేత కుటుంబం ఆత్మహత్య

ABN , Publish Date - Mar 25 , 2024 | 10:28 PM

సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యల వెనుక నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు చంద్రబాబు ఓ కమిటీని ఏర్పాటు చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) తెలిపారు. జిల్లాలోని వైసీపీ ప్రభుత్వ అరాచకాల కారణంగానే చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందని అన్నారు.

Kollu Ravindra: వైసీపీ ప్రభుత్వ అరాచకాల కారణంగానే చేనేత కుటుంబం ఆత్మహత్య

కడప: ఒంటిమిట్టమండలం కొత్తమాధవరంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాన్ని సోమవారం నాడు టీడీపీ ప్రత్యేక కమిటీ బృందం పరామర్శించింది.మాజీమంత్రి కొల్లు రవీంధ్ర నేతృత్వంలో కమిటీని టీడీపీ చీఫ్ చంద్రబాబు నియమించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించి టీడీపీ నేతలు ధైర్యం చెప్పారు. కర్నూల్ ఎంపీ సంజీవ కుమార్, టీడీపీ పొలిట్ బ్యూరోసబ్యులు శ్రీనివాసులరెడ్డి, రాజంపేట పార్ల మెంటు అధ్యక్షులు జగన్మోహన్ రాజు, సీ రామచంద్రయ్య ఇతర టీడీపీ నేతలు వారి వెంట ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఆత్మహత్యల వెనుక నిజాలను వెలుగులోకి తెస్తాం : కొల్లు రవీంద్ర

సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యల వెనుక నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు చంద్రబాబు ఓ కమిటీని ఏర్పాటు చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) తెలిపారు. జిల్లాలోని వైసీపీ ప్రభుత్వ అరాచకాల కారణంగానే చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాధవరం లో జరిగిన చేనేత కుటుంబం ఆత్మహత్య మనసును కలిచివేసిందని చెప్పారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని అన్నారు. సుబ్బారావు కుటుంబానికి చెంది న ఆస్తిని రికార్డులు తారు మారు చేశారని అన్నారు. పాలా చలపతి రావు ఆస్తిని శ్రావణి పేరుతో ఆన్‌లైన్‌లో ఎక్కించారని చెప్పారు. రెవెన్యూ అధికారుల దగాకు వైసీపీ నేతలే కారణమన్నారు. జగన్ బలహీన వర్గాలపై ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రొద్దుటూరులో చేనేత కార్మి కుడు నందం సుబ్బయ్యను వైసీపీ నాయకులు హత్య చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల కోసం వైసీపీ నేతలు అక్రమాలు చేయడం తగదన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబంలో అమ్మాయికి అండగా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారని అన్నారు. బాధిత కుటుంబానికి కుటుంబానికి టీడీపీ తరపున రూ.10 లక్షలు ఎక్స్ గ్రేసి యా ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. చేనేతలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అమ్మాయి చదువుకుని ఉద్యో గం వచ్చే వరకు అండగా ఉంటామని నారా లోకేష్ ఫోన్‌లో హామీ ఇచ్చారని తెలిపారు. చేనేతలకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. మేనిఫెస్టో లో కూడా 55 ఏళ్ల చేనేతలకు 4 వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించామని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్నీ విధాలా ఆదుకుంటామని మాజీమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

చేనేత కుటుంబం ఆత్మహత్య ఘటన చాలా బాధాకరం: శ్రీనివాస రెడ్డి

చేనేత కుటుంబం ఆత్మహత్య ఘటన చాలా బాధాకరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి(Srinivasa Reddy) అన్నారు. ప్రభుత్వ వేధింపుల వల్ల చేనేత కుటుంబం ఆత్మహ చేసుకుందని చెప్పారు. కుటుంబాన్ని కోల్పోయి అమ్మాయి ఒంటరి అయ్యిందని అన్నారు. వీరిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం భూ కబ్జాలకు పాల్పడి సామాన్యులను పొట్టన పెట్టుకుంటుందని మండిపడ్డారు. బీసీలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు.ప్రస్తుత ప్రభుత్వంలో ఎక్కువ శాతం వేధింపులు ఉన్నాయన్నారు. టీడీపీ అధికారం లోకి రాగానే ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు. సుబ్బారావు మూడు ఎకరాల భూమిని టీడీపీ అధికారంలోకి రాగానే అప్పగిస్తామని లోకేష్ హామీ ఇచ్చారని శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Updated Date - Mar 25 , 2024 | 10:29 PM