Share News

AP Politics: కేశినేని నానికి మతి భ్రమించింది కేశినేని చిన్ని తీవ్ర విమర్శలు

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:43 AM

విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు కేశినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. నానికి మతి భ్రమించిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేశినేని నానికి విశ్వాసం లేదని చిన్ని మండిపడ్డారు. వైసీపీలో నాని చేరడంతో.. సైకోలు అందరూ ఒకే చోట చేరారని విమర్శలు గుప్పించారు.

 AP Politics: కేశినేని నానికి మతి భ్రమించింది కేశినేని చిన్ని తీవ్ర విమర్శలు

అమరావతి: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు కేశినేని చిన్ని (Kesineni Chinni) హాట్ కామెంట్స్ చేశారు. నానికి మతి భ్రమించిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేశినేని నానికి విశ్వాసం లేదని చిన్ని మండిపడ్డారు. వైసీపీలో నాని చేరడంతో.. సైకోలు అందరూ ఒకే చోట చేరారని విమర్శలు గుప్పించారు. విజయవాడ లోక్ సభకు వైసీపీ నుంచి కేశినేని నాని బరిలోకి దిగితే తప్పకుండా ఓడిపోతారని చెప్పారు. 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడని స్పష్టం చేశారు. కానీ నానికి టికెట్‌ ఇచ్చే అంశంపై వైసీపీ హైకమాండ్ స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. కేశినేని నాని ప్రజా జీవితానికి ఇక కాలం చెల్లిందని విమర్శించారు. వైసీపీలో చేరిన తర్వాత నాని స్థాయి దిగజారిందని గుర్తుచేశారు. దేవినేని అవినాష్ ముఖ్య అనుచరుడిగా మారాడని ధ్వజమెత్తారు. తాను బరిలోకి దిగే అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని కేశినేని చిన్ని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ టికెట్ల కేటాయింపు అంశంపై చర్చిస్తారని కేశినేని చిన్ని వివరించారు. తనను ఎక్కడ నుంచి పోటీ చేయాలని కోరితే అక్కడ నుంచి బరిలోకి దిగుతానని చిన్ని అంటున్నారు. కేశినేని నానిపై పోటీ చేసేందుకు సిద్ధమేనని స్పష్టంచేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 01 , 2024 | 11:43 AM