Share News

AP News: కడప జిల్లాలో దారుణం

ABN , Publish Date - Mar 25 , 2024 | 07:58 AM

Andhrapradesh: జిల్లాలోని లింగాలమండలం తాతిరెడ్డిపల్లెలో లక్ష్మినారాయణ అనే వ్యక్తిపై నారాయణ రెడ్డి అనే వ్యక్తి వేటకొడవలితో దాడి చేశాడు. దీంతో నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో నారాయణరెడ్డిని స్థానికులు పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

AP News: కడప జిల్లాలో దారుణం

కడప, మార్చి 25: వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో అందరికీ తెలిసిందే. భార్య ఉన్నప్పటికీ భర్త మరో వ్యక్తితో, భర్త ఉన్నప్పటికీ భార్య మరొకతనితో సంబంధాలు పెట్టుకుంటుంటారు. అయితే వీరి మధ్య వివాహేతర సంబంధం గురించి తెలిసిన సదరు భర్త, భార్యలు కొందరు వారి మానాన వారిని వదిలేస్తే.. మరికొందరు మాత్రం తమకు చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతారు. చివరకు ఎదుటి వారి ప్రాణాన్ని కూడా తీయడానికి వెనకాడారు. ఇలాంటి ఘటనే కడప జిల్లాలో (Kadapa) చోటు చేసుకుంది.

బీఆర్‌ఎస్‌.. మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పు?


జిల్లాలోని లింగాలమండలం తాతిరెడ్డిపల్లెలో లక్ష్మినారాయణ అనే వ్యక్తిపై నారాయణ రెడ్డి అనే వ్యక్తి వేటకొడవలితో దాడి చేశాడు. దీంతో నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో నారాయణరెడ్డిని స్థానికులు పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

IPL 2024: ముంబై మ్యాచులో ట్విస్ట్.. గుజరాత్ గెలుపునకు వీరే ప్రధాన కారణం

Simon Harris: చిన్న వయస్సులోనే ఐర్లాండ్ ప్రధానిగా ఎంపికైన భారత సంతతి వ్యక్తి


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 25 , 2024 | 08:01 AM