Share News

Janasena: జగన్ జమానాలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీ.. నాదెండ్ల మనోహర్..

ABN , Publish Date - Mar 29 , 2024 | 04:48 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతున్న తరుణంలో అగ్ర నేతలందరూ ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో జనసేన ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్ పది నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల ప్రచారం పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Janasena:  జగన్ జమానాలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీ.. నాదెండ్ల మనోహర్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతున్న తరుణంలో అగ్ర నేతలందరూ ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో జనసేన ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్ పది నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల ప్రచారం పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 12వరకు పిఠాపురంలో, 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజా నగరం నియోజకవర్గంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలలో ఉన్న నాయకులు అందరూ సమన్వయం చేసుకుని కార్యక్రమాలు నిర్వహించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేని పరిస్థితి రావడం వాస్తవమేనని, రాష్ట్రం మంచి కోసం, యువత భవిష్యత్ కోసం పవన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని వాటిని పాటించక తప్పదని కోరారు.

రాష్ట్రంలో జరగుతున్న అవినీతి గురించి 8,03,600 ఫిర్యాదులు వచ్చాయన్న నాదెండ్ల మనోహర్ ఎన్ని చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఒక్కసారి అయినా ఈ కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులపై సీఎం, మంత్రులు వివరణ ఇచ్చారా అని నిలదీశారు. పరిపాలనపై శ్రద్ద చూపించకుండా, పట్టించుకోకుండా సర్టిఫికేట్ ఇచ్చుకుంటారా అని ఫైర్ అయ్యారు. టీచర్ల బదిలీల్లో ఎన్నో వందల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతినిరోధక శాఖ అధికారులు ఇప్పటి వరకు ఎందుకు వాస్తవాలు వెల్లడించలేదో చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.


కొంతమంది కావాలనే వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిందలు వేస్తున్నారు. ఒక అభ్యర్ది ఎంపికలో అనేక కోణాల్లో పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటాం. పొత్తుల్లో భాగంగా ఇబ్బందులు వచ్చాయనేది అందరూ అర్దం చేసుకోవాలి. జగన్ జమానాలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఏపీ. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చకు సిద్దమా. రూపాయి అవినీతి జరగలేదని జగన్ చెప్పుకోవడానికి సిగ్గుండాలి. జగన్ పదే పదే అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ ఐదేళ్లల్లో 130 సార్లు బటన్ నొక్కానని, ఒక్క రూపాయి కూడా అవినీతి లేదని జగనే సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. ఈ సీఎం చెప్పే మాటలు వింటుంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది.

- నాదెండ్ల మనోహర్, జనసేన ముఖ్య నేత

"అవినీతిపై పై చర్యలు తీసుకోకుండా స్వయంగా ముఖ్యమంత్రే పైల్ ను పక్కన పడేశారు. ఎన్నికల సంఘం ఈ అంశాలను దృష్టి లో పెట్టుకుని పరిశీలించాలి. రాష్ట్ర డీజీపీగా ఉన్న వ్యక్తి, ఎసీబీ డీజీపీ గా కూడా ఉన్నారు. ఆయన ఈ అవినీతి కేసులపై ఎందుకు స్పందించలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇప్పుడు అయినా వాస్తవాలు చెప్పాలి. నేను చెప్పింది వాస్తవం కాదని మంత్రులు ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ ఇచ్చిన రిపోర్టే చెబుతోందని" నాదెండ్ల మనోహర్ వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 05:10 PM