Share News

Pawan Kalyan: విధ్వంసం పుస్తకం.. పాలకులకు ఓ హెచ్చరిక..

ABN , Publish Date - Feb 15 , 2024 | 09:56 PM

విధ్వంసం పుస్తకం పాలకులకు ఓ హెచ్చరిక వంటిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) అన్నారు. రచయిత ఆలపాటి సురేష్ రచించిన విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు

Pawan Kalyan: విధ్వంసం పుస్తకం.. పాలకులకు ఓ హెచ్చరిక..

విజయవాడ: విధ్వంసం పుస్తకం పాలకులకు ఓ హెచ్చరిక వంటిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) అన్నారు. రచయిత ఆలపాటి సురేష్ రచించిన విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విధ్వంసం రచయత ఆలపాటి సురేష్.. పుస్తకాన్ని తనకు పంపారని తెలిపారు. ఈ పుస్తకాన్ని అయన ప్రజల పక్షం వహించి రాశారన్నారు. ఎంత బిజీగా వున్నా కూడా సురేష్ కుమార్ గారిపై వున్న గౌరవమే.. తనను ఈ కార్యక్రమానికి రప్పించిందన్నారు.

700 పేజీలతో వచ్చిన ఈ విధ్వంసం పుస్తకం పాలకులకు ఎలా ఉండకూడదో చెప్పే ఒక హెచ్చరిక అని పవన్ కళ్యాణ్ అన్నారు. కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం... అదే విధంగా కూలిపోతుందన్నారు. 33 వేల మంది ఆడపిల్లలు వైసీపీ వలంటీర్ల వల్ల మాయమయ్యారని తాను అనలేదన్నారు. వాళ్ళు సేకరించిన సమాచారం వల్ల మాయమయ్యారు అయ్యారు అని చెప్పలేదని గుర్తు చేశారు. తాను సేవ చేస్తున్న వలంటీర్లను ఎవరినీ అనడం లేదని.. తప్పు చేసిన కొంత మందిని మాత్రమే అంటున్నానని తెలిపారు. క్లాస్ వార్ అని చెప్పే జగన్.. ఎందరికో ఉపయోగపడే ఇసుకను ఒక్క కంపెనీకే దారాదత్తం చేశారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 09:56 PM