Share News

CPM Raghavulu: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే

ABN , Publish Date - May 09 , 2024 | 11:19 AM

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని సీపీఎం రాఘవులు ఫైర్ అయ్యారు. నేడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే.. ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమైందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షిస్తానంటూ జగన్ వ్యాఖ్యలు కార్మికులను, ప్రజల్ని ఎగతాళి చేయడమేనన్నారు.

CPM Raghavulu: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే

విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ (CM Jagan) చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని సీపీఎం రాఘవులు ఫైర్ అయ్యారు. నేడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే.. ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమైందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షిస్తానంటూ జగన్ వ్యాఖ్యలు కార్మికులను, ప్రజల్ని ఎగతాళి చేయడమేనన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అమ్మి, అదానికి అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి కాదా ? అని రాఘవులు ప్రశ్నించారు. రాష్ట్రంలో కార్మిక, ఉద్యోగుల ఉద్యమాన్ని కిరాతకంగా జగన్ అణచివేశారన్నారు. ఉద్యమాలు చేసిన వారిని హౌస్ అరెస్టు చేయడం, జైలుకు పంపించడం వంటివి చేశారన్నారు. కపట నాటకాలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని.. వారిని గద్దె దించాలని రాఘవులు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి...

Andhra Pradesh : అప్పుల కుప్ప

Andhra Pradesh : కడప బాద్‌షా ఎవరో?

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2024 | 11:19 AM