Share News

AP Elections: ఎన్టీఆర్‌ జిల్లా చెక్‌పోస్టుల వద్ద అధికారుల ముమ్మర తనిఖీలు

ABN , Publish Date - Mar 23 , 2024 | 03:28 PM

Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నగదు తరలింపులపై పోలీసులు దృష్టిసారించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిస్తున్న నగదును పట్టుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో చెక్ పోస్టులు వద్ద శనివారం అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న కోటి రూపాయల వరకు నగదు పట్టుబడటంతో కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా ప్రత్యేక దృష్టి సారించారు.

AP Elections: ఎన్టీఆర్‌ జిల్లా చెక్‌పోస్టుల వద్ద అధికారుల ముమ్మర తనిఖీలు

విజయవాడ, మార్చి 23: ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న నేపథ్యంలో నగదు తరలింపులపై పోలీసులు (AP Police) దృష్టిసారించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిస్తున్న నగదును పట్టుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో చెక్ పోస్టులు వద్ద శనివారం అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న కోటి రూపాయల వరకు నగదు పట్టుబడటంతో కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిరోజూ చెక్‌పోస్టుల వద్ద పనితీరు పరిశీలించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాల తనిఖీ తీరును కలెక్టర్, సీపీ పరిశీలించారు.

VH: రేవంత్.. నీ స్థాయిని నువ్వే తగ్గించుకోకు!


ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. జిల్లాలో సీ విజిల్ యాప్ ద్వారా ప్రతిరోజూ 15 ఫిర్యాదులు వస్తున్నాయని.. టీంలు సకాలంకో అక్కడకు వెళ్లి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. 1950 కాల్ సెంటర్, యన్జీఎస్.పి పోర్టల్, జిల్లా స్థాయిలో వచ్చే నెంబర్లకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వచ్చిన కథనాల పరిశీలనకు ఒక టీంను ఏర్పాటు చేశామని చెప్పారు. పొటిలికటల్‌కు సంబంధించిన న్యూస్ ఐటెమ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రిపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా లోతుగా చూస్తున్నామన్నారు. ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కరించిన తర్వాత ఆ ఫిర్యాదీకి సమాచారం కూడా ఇస్తున్నామని వెల్లడించారు. వాలంటీర్, ఇతర ప్రభుత్వ సిబ్బంది, అధికారి ఏవరైనా రాజకీయ సభలు, ర్యాలీల్లో పాల్గొనవద్దని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్దంగా పాల్గొన్న వారిపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజూ చెక్ పోస్ట్‌లను ఏదోక ప్రాంతంలో పరిశీలించి సిబ్బంది పని తీరును పరిశీలించి సూచనలు చేస్తున్నామన్నారు. ఈరోజు తిరువూరు పరిసర ప్రాంతాలలో సీపీతో కలిసి పరిశీలిస్తున్నామన్నారు.

పోలీసు కమీషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 21 చెక్ పోస్టులు పెట్టి పోలీస్, సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని నియమించామన్నారు. రూ.50 వేల నగదు దాటి ఎవరూ తీసుకెళ్లవద్దని మరోసారి స్పష్టం చేశారు. తప్పని సరైతే తప్పకుండా లెక్కలు, ఆధారాలు చూపించి తీసుకెళ్లాలని అన్నారు. మద్యం రవాణాకు సంబంధించి నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ పరిశీలన చేస్తూనే ఉంటారన్నారు. లెక్కలు లేని నగదును ఐటీ శాఖకు అప్పగించడం జరుగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి..

Kavitha: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయం.. నిశితంగా పరిశీలిస్తే..!

Nellore: రాష్ట్రాన్ని బాగు చేసే సరైన నాయకుడు చంద్రబాబు: భువనేశ్వరి


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 04:29 PM