Share News

AP Politics: పవన్‌ అలా చేయడమే మంచిది.. హరి రామజోగయ్య కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 11 , 2024 | 07:42 PM

మాజీ ఎంపీ చేగొండి హరి రామజోగయ్య(Harirama Jogaiah) రాజకీయ విశ్లేషణలపై లేఖ రాశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పార్లమెంటుకు పోటీ చేయాలని ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిదని తెలిపారు. రాష్ట్ర పాలన, అధికారంలో భాగస్వామ్యం కావాలంటే ఆయన శాసనసభకు పోటీ చేయడమే మేలని తెలిపారు.

AP Politics: పవన్‌ అలా చేయడమే మంచిది.. హరి రామజోగయ్య కీలక వ్యాఖ్యలు

ఏలూరు: మాజీ ఎంపీ చేగొండి హరి రామజోగయ్య (Harirama Jogaiah) రాజకీయ విశ్లేషణలపై లేఖ రాశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్లమెంటుకు పోటీ చేయాలని ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిదని తెలిపారు. రాష్ట్ర పాలన, అధికారంలో భాగస్వామ్యం కావాలంటే ఆయన శాసనసభకు పోటీ చేయడమే మేలని తెలిపారు. గతంలో చిరంజీవి అనుభవం చూస్తే తెలుస్తుందని చెప్పారు. పవన్ శాసనసభకు పోటీ చేయకపోతే భవిష్యత్తులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోసం జనసేనను తెలుగుదేశంలో విలీనం చేయడం తప్పదనే దుష్ప్రచారం మొదలవుతుందని అన్నారు. రాష్ట్రంలో కాపు కాసే బడుగు బలహీన వర్గాల రాజ్యానికి తెరపడి కమ్మ, రెడ్డి రాజ్యాల ఏర్పాటుకు తెరలేస్తుందని ఈ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 07:46 PM