Share News

Supreme Court: స్కిల్ కేసులో ఆసక్తికర అంశాలను ప్రస్తావించిన సుప్రీం కోర్టు

ABN , Publish Date - Jan 17 , 2024 | 05:38 PM

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( Skill Development Case ) తీర్పులో సుప్రీంకోర్టు ( Supreme Court ) ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి బుధవారం ఓ కాపీని విడుదల చేసింది.

Supreme Court: స్కిల్ కేసులో ఆసక్తికర అంశాలను ప్రస్తావించిన సుప్రీం కోర్టు

ఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( Skill Development Case ) తీర్పులో సుప్రీంకోర్టు ( Supreme Court ) ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి బుధవారం ఓ కాపీని విడుదల చేసింది. రఫెల్ కేసులో జస్టిస్ జోసెఫ్ వెలిబుచ్చిన అభిప్రాయాలను తన తీర్పులో జస్టిస్ అనిరుద్ద బోస్ సమర్ధించారు. జస్టిస్ జోసెఫ్ అభిప్రాయాన్ని తీర్పులో భాగంగానే తీసుకోవాలని.. ఇదే ఆనవాయితీగా వస్తోందని జస్టిస్ అనిరుద్ద బోస్ కోర్టుకు తెలిపారు. చంద్రబాబుపై ఉన్న కేసు పాతదైనా దర్యాప్తు ప్రారంభ తేదీ నుంచే 17 ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ద బోస్ స్పష్టం చేశారు. స్కిల్ కేసులో ఇప్పటికైనా ముందస్తు అనుమతులు తీసుకొని విచారించుకోవచ్చని జస్టిస్ అనిరుద్ద బోస్ కోర్టుకు తెలిపారు. అధికార విధుల్లో భాగంగా చంద్రబాబు స్కిల్ అనుమతుల కోసం నిర్ణయం తీసుకున్నారా? లేదా? అని తేల్చడానికి న్యాయపరమైన విచారణ అవసరమని జస్టిస్ అనిరుద్ద బోస్ పేర్కొన్నారు.

ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ అనిరుద్ద బోస్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. అయితే చంద్రబాబుపై ఉన్న కొత్త కేసులకు మాత్రమే 17 ఏ వర్తిస్తుందని జస్టిస్ బేలా ఎం త్రివేదీ తెలిపారు. రఫెల్‌ కేసు తీర్పులో జస్టిస్ కేఎం జోసెఫ్‌ సెక్షన్‌ 17ఏ కి సంబంధించి వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా తన తీర్పులో జస్టిస్‌ బేలా త్రివేది పేర్కొన్నారు. ముందస్తు అనుమతులు అవసరమని జస్టిస్‌ జోసెఫ్‌ తీర్పులో స్పష్టంగా అభిప్రాయపడినప్పటికీ అనుమతులు పాత తేదీల నుంచి జరిగిన నేరాలకు వర్తిస్తుందా లేదా అని నిర్దిష్టంగా చెప్పలేదని జస్టిస్‌ త్రివేది కోర్టుకు వివరించారు. ఈ కేసులో ముందస్తు అనుమతులు తీసుకోనంత మాత్రాన దర్యాప్తును రద్దు చేయాలనడం దర్యాప్తు సంస్థల అధికారాలను కట్టడి చేయడమేనని జస్టిస్ బేలా ఎం త్రివేదీ సుప్రీం కోర్టుకు చెప్పారు.

Updated Date - Jan 17 , 2024 | 05:39 PM