TDP: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కథనాలతో ఈసీకు టీడీపీ లేఖ
ABN , Publish Date - Feb 06 , 2024 | 09:24 PM
కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం(TDP) నేతలు మంగళవారం మరో ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కార్యాలయంలో ఐపాక్ బృందం కోవర్టు ఆపరేషన్ చేసి డేటా అంతా తస్కరించిన వ్యవహారాన్ని దర్యాప్తు చేయాలని కోరారు.
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం(TDP) నేతలు మంగళవారం మరో ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కార్యాలయంలో ఐపాక్ బృందం కోవర్టు ఆపరేషన్ చేసి డేటా అంతా తస్కరించిన వ్యవహారాన్ని దర్యాప్తు చేయాలని కోరారు. డేటా చౌర్యంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN - AndhraJyothy) లో వచ్చిన కథనాల కాపీలను ఈసీఐకు అందజేశారు.
ఐపాక్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఔట్ సోర్స్ ఉద్యోగులుగా ఏపీ ఎన్నికల కార్యాలయంలో చేరి... డేటా అంతా వైసీపీకు అందించినట్లు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఓట్ల అక్రమాలు వరుసగా నమోదవుతున్న నేపథ్యంలో తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరారు. నకిలీ ఓట్ల అక్రమాల్లో వరుస ఘటనల నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈసీఐకు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు.