Share News

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం

ABN , Publish Date - May 25 , 2024 | 06:59 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్య బంగాళఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమైంది. తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఈ అల్పపీడనం కాస్తా తుపాన్‌గా మారడంతో అక్కడక్కడ చెదురు ముదురుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం
Weather update

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్య బంగాళఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమైంది. తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. అల్పపీడనం కాస్తా తుపాన్‌గా మారడంతో అక్కడక్కడ చెదురు ముదురుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం మధ్య బంగాళఖాతంలో ప్రవేశించింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారనుంది.


తుపాన్‌కు రేమాల్‌గా నామకరణం చేసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. చెదురు ముదురు వర్షాలే పడతాయని భారీ వర్షాలకు ఆస్కారం లేదని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల 4, నుంచి 5 సెంటిమీటర్ల వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమే ఉంది. గత కొన్నిరోజుల నుంచి ఎండల తీవ్రతతో ఇబ్బంది పడిన ప్రజలకు వర్షాలతో కాస్త ఉపశమనం కలుగనుంది.


ఈ నెల 26 రాత్రి లేదంటే 27 తెల్లవారుజామున తుపాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి పవనాలు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. దీంతో ముందుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. జూన్ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కొన్ని ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది.

Updated Date - May 25 , 2024 | 07:11 PM