AP NEWS: రాబోయే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు కావడం ఖాయం: ప్రత్తిపాటి పుల్లారావు
ABN , Publish Date - Feb 23 , 2024 | 04:39 PM
సీఎం జగన్‌రెడ్డికి పేదల ఉసురు తగిలి రాబోయే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) హెచ్చరించారు. గృహ నిర్మాణంపై ప్రభుత్వానికి పుల్లారావు శుక్రవారం నాడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టిడ్కో ఇళ్ల వద్ద టీడీపీ - జనసేన నాయకులతో ఆందోళనకు దిగారు.
పల్నాడు జిల్లా: సీఎం జగన్‌రెడ్డికి పేదల ఉసురు తగిలి రాబోయే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) హెచ్చరించారు. గృహ నిర్మాణంపై ప్రభుత్వానికి పుల్లారావు శుక్రవారం నాడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టిడ్కో ఇళ్ల వద్ద టీడీపీ - జనసేన నాయకులతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయంలో రికార్డు స్థాయిలో గృహనిర్మాణాలు జరిగాయని తెలిపారు.
టిడ్కో ఇళ్ల సముదాయంలో అన్ని వసతులు ఆనాడే కల్పించామని చెప్పారు. వైసీపీ పాలనలో 500 కుటుంబాలు కూడా ఇళ్లలోకి రాలేదని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా టిడ్కో ఇళ్ల సముదాయం మారిందని మండిపడ్డారు. ఐదేళ్లలో వైసీపీ కట్టిన ఇళ్లెన్ని? అవి ఎక్కడ? జవాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. పేదల ఉసురు తగలబట్టే ఆరు నెలల ముందే వైసీపీ నేతలు గుంటూరు పారిపోయారని ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...