Share News

Phone Tapping: ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సీఈవోకు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

ABN , Publish Date - Mar 24 , 2024 | 08:08 AM

అమరావతి: టీడీపీ నాయకుల ఫోన్ల టాపింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల కమిషన్‌కు లేక ద్వారా ఫిర్యాదు చేశారు. ఇంటిలిజెన్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈవోని కోరారు.

Phone Tapping: ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సీఈవోకు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

అమరావతి: టీడీపీ నాయకుల (TDP Leaders) ఫోన్ల టాపింగ్ (Phone Tapping) వ్యవహారంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) ఎన్నికల కమిషన్‌కు లేక ద్వారా ఫిర్యాదు చేశారు. ఇంటిలిజెన్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈవో (CEO)ని కోరారు. ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులపై మెగా వ్యవహారాలను వర్ల రామయ్య ఖండించారు.

కాగా ‘టీడీపీ నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేసి వారిని వేధించేందుకు ఇంటెలిజెన్స్‌ విభాగం అడిషనల్‌ డీజీపీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సిబ్బందిని నియమించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ట్యాప్‌ చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలి’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. శనివారం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశంలో ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ విశ్వేశ్వరరావు తచ్చాడుతూ ఫేక్‌ ఐడీ కార్డుతో పట్టుబడ్డారని తెలిపారు. ఇంటిలిజెన్స్‌ విభాగం నుంచి వచ్చానని, టీడీపీ నిర్వహించే మీటింగ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇంటెలిజెన్స్‌కు అందించేందుకు వచ్చానని తెలిపారన్నారు. కానిస్టేబుల్‌ ఫోన్‌ను పరిశీలించగా విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్‌ ట్యాప్‌ చేసినట్లు తెలిసిందన్నారు. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు టీడీపీ నేతలఫోన్లు ట్యాప్‌ చేసేందుకు పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌ వాడుతున్నారని అనుమానంగా ఉందన్నారు. ఆంజనేయులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు.

Updated Date - Mar 24 , 2024 | 08:08 AM