Share News

AP Politics: అన్నా, చెల్లెలు వేర్వేరు కాదు.. వారిద్దరివీ నాటకాలే: నాగోతు రమేష్ నాయుడు

ABN , Publish Date - Jan 18 , 2024 | 06:45 PM

ఎం జగన్మోహన్‌ రెడ్డి ( CM JAGAN ) , ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ( YS Sharmila ) లు వేర్వేరు కాదని.. వారిద్దరూ కలిసే ఈ నాటకం ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ( Nagotu Ramesh Naidu ) అన్నారు.

AP Politics: అన్నా, చెల్లెలు వేర్వేరు కాదు.. వారిద్దరివీ నాటకాలే: నాగోతు రమేష్ నాయుడు

విజయవాడ: సీఎం జగన్మోహన్‌ రెడ్డి ( CM JAGAN ) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ( YS Sharmila ) లు వేర్వేరు కాదని.. వారిద్దరూ కలిసే ఈ నాటకం ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ( Nagotu Ramesh Naidu ) అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ ఎంపిక చేసిన అభ్యర్థులు మిడిల్ డ్రాప్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇవ్వరన్నారు. షర్మిల ఒక రాజకీయ నిరుద్యోగి అని.. ఏపీలో కాంగ్రెస్ ఖాళీగా ఉండడంతో ఆమె దరఖాస్తు చేసుకుని అధ్యక్షరాలు అయ్యారని సెటైర్లు వేశారు. అన్నా, చెల్లెళ్ల డ్రామాలకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అందరూ హర్షించదగ్గదేనని చెప్పారు. ఎస్సీ వర్గాలకు గత నాలుగేళ్లుగా అన్యాయం చేసి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయం చేయడాన్ని బీజేపీ తప్పుబడుతోందన్నారు. కేంద్రం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను సీఎం జగన్ దారి మళ్లించారని విమర్శించారు. దళితులను మోసం చేసిన జగన్ వారికి ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైస్ ఛాన్స్‌లర్ల వ్యవస్థను రాజకీయ ఆవాసాలుగా మార్చేశారని.. అందువల్లే విద్యాలయాల్లో రాజకీయాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలను బదిలీ చేసే వ్యవస్థకు వైసీపీ శ్రీకారం చుట్టిందని నాగోతు రమేష్ నాయుడు తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 07:44 PM