Share News

MLC Ashok Babu: జగన్ చేసే దుర్మార్గాలపై రోజుకో కేసు పెట్టొచ్చు

ABN , Publish Date - Jan 29 , 2024 | 07:55 PM

సీఎం జగన్(CM JAGAN) చేసే దుర్మార్గాలపై రోజుకో కేసు పెట్టవచ్చని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు(MLC Ashok Babu) వ్యాఖ్యానించారు. చంద్రుడు, సూర్యుడికి పట్టిన గ్రహణాలు వీడినట్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న కేసులు కూడా పటాపంచలవున్నాయని చెప్పారు.

MLC Ashok Babu: జగన్ చేసే దుర్మార్గాలపై రోజుకో కేసు పెట్టొచ్చు

అమరావతి: సీఎం జగన్(CM JAGAN) చేసే దుర్మార్గాలపై రోజుకో కేసు పెట్టవచ్చని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు(MLC Ashok Babu) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రుడు, సూర్యుడికి పట్టిన గ్రహణాలు వీడినట్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న కేసులు కూడా పటాపంచలవున్నాయని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీం కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందన్నారు. ఈ కేసు అసలు 420 సెక్షన్ కిందికి రాదని తెలిపిందన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వానికి, సైకో జగన్‌కు బుద్ది రావాలన్నారు. ప్రతి చిన్న విషయానికి జగన్ సుప్రీం కోర్టుకు వెళ్తున్నాడని అన్నారు. జగన్ ఎందుకు తన కేసుల్లో 3వేల వాయిదాలు తీసుకున్నాడని ప్రశ్నించారు.

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో టీడీపీ అధికారంలోకి వస్తుందనడం అంతే నిజమని తేల్చిచెప్పారు. సాక్ష్యులను విచారించకుండానే చంద్రబాబును అరెస్టు చేయించారని మండిపడ్డారు. అనేక ఈడీ కేసులు కలిగిన జగన్ కోర్టుకు వెళ్లడం లేదంటే వ్యవస్థలను ఎంత మేనేజ్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కక్షపూరితంగానే చంద్రబాబు, టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. సూర్యనారాయణ అనే ఉద్యోగిని ఎదిరించి జగన్ ఏమీ చేయలేకపోయరని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.

Updated Date - Jan 29 , 2024 | 07:55 PM