AP Govt: మాజీ సీఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ABN , Publish Date - Jun 28 , 2024 | 08:57 PM
మాజీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి (Jawahar Reddy) ఉద్యోగ విరమణ తేదీని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 తేదీన కెఎస్ జవర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు.
అమరావతి: మాజీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి (Jawahar Reddy) ఉద్యోగ విరమణ తేదీని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 తేదీన కెఎస్ జవర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డికి నిన్న పోస్టింగ్ ఇచ్చారని అన్నారు. జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనుండటంతో ఆ విభాగం పూర్తి అదనపు బాధ్యతలను అనంతరాముకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సాధారణ పరిపాలన శాఖ జీపీఎం-ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉద్యోగ విరమణను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆ విభాగం పూర్తి అదనపు బాధ్యతలను పోలభాస్కర్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఉద్యోగ విరమణను జూన్ 30 తేదీగా నోటిపై చేస్తూ ఆదేశించింది. కె.వెంకటరమణా రెడ్డి కూడా జూన్ 30 తేదీన ఉద్యోగ విరమణ చేయనుండటంతో ప్రభుత్వం నోటిఫై చేసింది.