Share News

CM Chandrababu: బీపీసీఎల్, విన్ ఫాస్ట్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ..

ABN , Publish Date - Jul 10 , 2024 | 07:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ, విదేశీ సంస్థల పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పావులు కదుపుతున్నారు. ఈ మేరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL), విన్ ఫాస్ట్(WIN FAST) సంస్థల ప్రతినిధులతో సచివాయలంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించారు.

CM Chandrababu: బీపీసీఎల్, విన్ ఫాస్ట్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ..
CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ, విదేశీ సంస్థల పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పావులు కదుపుతున్నారు. ఈ మేరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL), విన్ ఫాస్ట్(WIN FAST) సంస్థల ప్రతినిధులతో సచివాయలంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారితో చర్చించారు. పారిశ్రామికవేత్తలకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం అని, సంస్థలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు వారికి వివరించారు.


ఏపీలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పెద్దలతో బీపీసీఎల్ పెట్టుబడులపై ఆయన చర్చించారు. దానికి కొనసాగింపుగా నేడు సంస్థ ప్రతినిథులతో భేటీ అయ్యారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4నుంచి 5వేల ఎకరాలు అవసరం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు సీఎంకు చెప్పారు. అవసరమైన భూములు కేటాయిస్తామని, 90రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు పూర్తి ప్రణాళికతో రావాలని చంద్రబాబు కోరారు. అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్టుతో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు చెప్పారు.

Praneeth Hanumanthu: తండ్రీకుమార్తె బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ అరెస్టు..


అనంతరం విన్ ఫాస్ట్ ప్రతినిధులతోనూ చంద్రబాబు సమావేశం అయ్యారు. విన్ ఫాస్ట్ అనే సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వియత్నాంలోనే పెద్ద పేరున్న సంస్థ. ఈ కంపెనీ సీఈవో పామ్ సాన్ చౌతోపాటు సంస్థ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి చంద్రబాబు వారికి వివరించారు. ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్లు రాష్ట్రంలో నెలకొల్పాలని సీఎం వారిని కోరారు. ప్లాంటుకు అవసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అన్ని విధాలా సహకరిస్తామని, పెట్టుబడులు పెట్టాలని వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. భేటీకి ముందు బీపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

MP Purandeswari: ఆ పంటపై పెనాల్టీ తీసేయాలని కేంద్రమంత్రిని కోరా: ఎంపీ పురందేశ్వరి

Diarrhea: పిడుగురాళ్ల లెనిన్ నగర్‌లో డయేరియా కలకలం..

Updated Date - Jul 10 , 2024 | 08:01 PM