Share News

Praneeth Hanumanthu: తండ్రీకుమార్తె బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ అరెస్టు..

ABN , Publish Date - Jul 10 , 2024 | 04:55 PM

సోషల్ మీడియాలో తండ్రీకూతురు బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కీచకుడు ప్రణీత్ హనుమంతును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్‌ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటి మీద హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.

Praneeth Hanumanthu: తండ్రీకుమార్తె బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ అరెస్టు..
Praneeth Hanumanthu

హైదరాబాద్: సోషల్ మీడియాలో తండ్రీకూతురు బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కీచకుడు ప్రణీత్ హనుమంతు (Praneeth Hanumanthu)ను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్‌ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటి మీద హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే హనుమంతుతోపాటు మరో ముగ్గురిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ వీడియో ఆధారంగా సోషల్ మీడియాలో తండ్రీకూతురుపై చర్చపెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వారిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఒకరిని అరెస్టు చేశారు.


మెుదట ఆ వీడియో చూసిన సినీ హిరో సాయిధరమ్ తేజ్ వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు ఎక్స్‌(ట్విటర్)లో ట్యాగ్ చేశారు. చిన్నారులపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మంచు మనోజ్, మంచు లక్ష్మి సైతం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యూట్యూబర్స్ తీరుపై ఆగ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో తెలంగాణ డీజీపీ రవి గుప్తా నిందితులపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. చిన్నారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రణీత్ హనుమంతు సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి:

Crime News: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భూమికే ఎసరు.. ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి..

Updated Date - Jul 10 , 2024 | 05:11 PM