Share News

Butchi Ram Prasad: జగన్ హిందువా? క్రైస్తవుడా ? చెప్పి తీరాల్సిందే!

ABN , Publish Date - Jan 17 , 2024 | 10:41 PM

సీఎం జగన్ ( CM JAGAN ) హిందువో, క్రైస్తవుడో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ శర్మ ( Butchi Ram Prasad Sharma ) ఎద్దేవా చేశారు.

Butchi Ram Prasad: జగన్ హిందువా? క్రైస్తవుడా ? చెప్పి తీరాల్సిందే!

అమరావతి: సీఎం జగన్ ( CM JAGAN ) హిందువో, క్రైస్తవుడో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ శర్మ ( Butchi Ram Prasad Sharma ) ఎద్దేవా చేశారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం మతాలను ఉపయోగించుకోవడం మానాలన్నారు. జగన్ హిందూ మతంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవించాలని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా జగన్ తన ఇంట్లో రూ.4 కోట్లతో పెద్ద సెట్టింగ్ వేసి, ప్రజా ధనం వృథా చేశారన్నారు. తాత్కాలిక సెట్టింగ్‌కి బదులు శాశ్వత ఆలయ నిర్మాణం చేపట్టి ఉంటే బాగుండేదన్నారు. జగన్ ప్రసాదం తీసుకుని పక్కన పెట్టేయడం హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లయిందని చెప్పారు. తిరుమలలో పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు జగన్ భార్య సమేతంగా ఎప్పుడూ వెళ్లలేదన్నారు.ఇంట్లో తన రాజకీయ ప్రయోజనాల కోసమే సెట్టింగ్ చేశారన్నారు. మణిపూర్‌లో 2 వేల చర్చిలను ధ్వంసం చేయడం పట్ల షర్మిల స్పందన అభినందనీయమని బుచ్చి రాం ప్రసాద్ శర్మ అన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:02 PM