Share News

Atchannaidu: అబద్దాల పునాదులపై ఎల్లకాలం బతకలేరని జగన్‌రెడ్డి గుర్తించాలి

ABN , Publish Date - Jan 01 , 2024 | 05:36 PM

అబద్దాల పునాదులపై ఎల్లకాలం బతకలేరని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) గుర్తించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పెన్షన్లపై ఇంకెన్నాళ్లీ నీతిమాలిన రాతలు. రూ.3వేల హామీపై మాట తప్పి ఒక్కొక్కరికి రూ.30వేలను జగన్‌రెడ్డి ఎగనామం పెట్టారు. నిజం చెబితే తల వేయిముక్కలవుతుందనే శాపం జగన్‌రెడ్డిని వేధిస్తోందన్నారు. రూ.3వేలు పెన్షన్ హామీపై అధికారంలోకి రాగానే మాట తప్పారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Atchannaidu:   అబద్దాల పునాదులపై ఎల్లకాలం బతకలేరని జగన్‌రెడ్డి గుర్తించాలి

అమరావతి: అబద్దాల పునాదులపై ఎల్లకాలం బతకలేరని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) గుర్తించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పెన్షన్లపై ఇంకెన్నాళ్లీ నీతిమాలిన రాతలు. రూ.3వేల హామీపై మాట తప్పి ఒక్కొక్కరికి రూ.30వేలను జగన్‌రెడ్డి ఎగనామం పెట్టారు. నిజం చెబితే తల వేయిముక్కలవుతుందనే శాపం జగన్‌రెడ్డిని వేధిస్తోందన్నారు. రూ.3వేలు పెన్షన్ హామీపై అధికారంలోకి రాగానే మాట తప్పారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీనీ తుంగలో తొక్కారన్నారు. మాట తప్పి మడమ తిప్పి ఒక్కొక్కరికీ రూ.30వేలు ఎగనామం పెట్టారని చెప్పారు. ఇప్పుడు పెన్షన్ దారులకు లేఖలోనూ పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రూ.200 పెన్షన్ రూ.1800 పెంచి రూ.2000 చేశారని అన్నారు.

చంద్రన్న ఐదేళ్లలో కొత్తగా 20 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశారని చెప్పారు. జగన్‌రెడ్డి ఐదేళ్లలో పెంచింది రూ.750 మాత్రమే, లబ్ధిదారులు 10 లక్షలు మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు రూ.7లక్షల కోట్ల బడ్జెట్లో 20 లక్షల కొత్త పెన్షన్లిచ్చారన్నారు. రూ.12లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న జగన్‌రెడ్డి ఇచ్చిందెంత అని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి జగన్‌రెడ్డి అబద్దాలను నమ్ముకున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక కూడా అవే పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని చెప్పారు. జగన్‌రెడ్డి చెప్పే అబద్దాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు తెలిపారు.

Updated Date - Jan 01 , 2024 | 05:36 PM