Share News

Diamonds: లక్కంటే ఇదే.. పొలంలో ఒకేరోజు 3 వజ్రాలు లభ్యం

ABN , Publish Date - May 27 , 2024 | 11:56 AM

ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లా సరిహద్దుల్లోని ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ పొలాల్లో ప్రతి వర్షాకాలంలో జరిగే అద్భుతం ఈసారి మళ్లీ చోటుచేసుకుంది. పొడి భూముల్లోనే విలువైన వజ్రాలు(diamonds), రాళ్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లా(Kurnool district) తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఒకేరోజు రైతులకు మూడు వజ్రాలు లభ్యమయ్యాయి.

Diamonds: లక్కంటే ఇదే.. పొలంలో ఒకేరోజు 3 వజ్రాలు లభ్యం
Kurnool district get 3 diamonds

ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లా సరిహద్దుల్లోని ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ పొలాల్లో ప్రతి వర్షాకాలంలో జరిగే అద్భుతం ఈసారి మళ్లీ చోటుచేసుకుంది. పొడి భూముల్లోనే విలువైన వజ్రాలు(diamonds), రాళ్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లా(Kurnool district) తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఒకేరోజు రైతులకు మూడు వజ్రాలు లభ్యమయ్యాయి. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా రైతులకు వజ్రాలు దొరికాయి.


అయితే ఆ మూడు వజ్రాల(diamonds) విలువ 20 లక్షలు ఉంటుందని స్థానిక వ్యాపారి అంచనా వేశారు. వాటిని 15 తులాల బంగారానికి స్థానిక వ్యాపారి కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల్లో జొన్నగిరి, మదనంతపురం, పగిడిరాయి, దేశాయి తండా గ్రామాలలో 10 వజ్రాలు లభించడం విశేషం. దీంతో అనేక మంది స్థానికులతోపాటు పక్క గ్రామాల వారు సైతం ఆయా ప్రాంతాల్లో వజ్రాల వేటకు వెళ్లి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


విజయనగర సామ్రాజ్య కాలంలో రాయలసీమ విలువైన రాళ్లు, వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. ఆ రోజుల్లో హంపి మార్కెట్‌లో వజ్రాలు కూరగాయల మాదిరిగా అమ్మేవారంటా. ఆ క్రమంలోనే ఏటా వర్షాకాలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల వేటకు కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ప్రాంతాలు హాట్ స్పాట్‌గా మారిపోయాయి. దీంతో ప్రతి ఏటా కర్నూలులోని తుగ్గలి, జొన్నగిరి, మద్దికెరె, అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు సహా పలు ప్రాంతాల్లోని భూముల్లో వర్షాకాలంలో ఎండిపోయిన భూముల్లో విలువైన రాళ్లు బయటపడుతున్నాయి.


ఇది కూడా చదవండి:

Bonda Uma: ఆయన దయతోనే రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం


Kaviya Maran: సన్ రైజర్స్ ఓటమితో కన్నీరు పెట్టుకున్న కావ్య పాప..వీడియో వైరల్

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 27 , 2024 | 12:02 PM