Share News

YSRCP: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 16 , 2024 | 03:12 PM

Andhrapradesh: అధికార పార్టీ వైసీపీకి గుడ్‌బై చెప్పేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఎమ్మెల్యే.. కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు రామచంద్రారెడ్డికి పురందేశ్వరి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు రామచంద్రారెడ్డితో ఆయన సతీమణి కూడా బీజేపీలో చేరారు.

YSRCP: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

విజయవాడ, మార్చి 16: అధికార పార్టీ వైసీపీకి (YSRCP) గుడ్‌బై చెప్పేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (Rayadurgam MLA Kapu Ramchandra Reddy) బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) సమక్షంలో ఎమ్మెల్యే.. కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు రామచంద్రారెడ్డికి పురందేశ్వరి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రారెడ్డితో ఆయన సతీమణి కూడా బీజేపీలో చేరారు.

కాగా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ఇ వ్వని కారణంగా గత కొంత కాలంగా వైసీపీ హైకమాండ్‌పై కాపు రామచంద్రారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి వైఖరి నచ్చకపోవడంతో ఆ పార్టీకి కొన్నిరోజుల క్రితమే కాపు రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా కాపు రామచంద్రారెడ్డి కాషాయి కండువా కప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి...

Anuradha Paudwal: బాలీవుడ్ గాయని అనూరాధ పౌడ్వాల్ బీజేపీలో చేరిక

MP Avinash: నెక్ట్స్ టార్గెట్‌ ఎంపీ అవినాష్.. ఎన్నికల్లోపే అరెస్ట్‌..?


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 16 , 2024 | 03:30 PM