Share News

Nara Lokesh: ఇంటికి కిలో బంగారమిచ్చినా జగన్‌కు ఓటమి తప్పదు..

ABN , Publish Date - Mar 27 , 2024 | 10:16 AM

ఇంటికి కిలో బంగారమిచ్చినా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు ఓటమి తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం... జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలని నిర్ణయానికొచ్చారన్నారు. ఈ నేపథ్యంలో చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారన్నారని నారా లోకేష్ అన్నారు.

Nara Lokesh: ఇంటికి కిలో బంగారమిచ్చినా జగన్‌కు ఓటమి తప్పదు..
Nara Lokesh

అమరావతి: ఇంటికి కిలో బంగారమిచ్చినా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ (CM Jagan)కు ఓటమి తప్పదని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం... జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలని నిర్ణయానికొచ్చారన్నారు. ఈ నేపథ్యంలో చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారన్నారని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో (Elections) ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

AP Elections: పిఠాపురంలో గెలిచేదెవరు.. ప‌వ‌న్ కు ల‌క్ష మెజార్టీ వ‌స్తుందా..?

రేణిగుంట (Renigunta)లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి చెందిన గోడౌన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు పట్టుకున్నారని నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ (YSRCP) తాయిలాల డంప్‌నైతే పట్టుకున్నారన్నారు. మరి ఇసుక, లిక్కర్‌లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్‌‌ను ఎప్పుడు పట్టుకుంటారని లోకేష్ ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజి బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహజ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలని నారా లోకేష్ తెలిపారు.

Ram Charan: రామ్ చరణ్ కూతురు క్లీంకార ఫేస్ రివీల్.. ఎంత క్యూట్‌గా ఉందో..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 27 , 2024 | 10:54 AM