Share News

AP Govt: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక

ABN , Publish Date - Jun 09 , 2024 | 08:00 PM

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు నాయుడు పనిమొదలు పెట్టారు.

AP Govt: చంద్రబాబు  ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక

అమరావతి: ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు నాయుడు పనిమొదలు పెట్టారు. కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆదేశాలకు అగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది.ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీతో అంటకాగిన అధికారుల కదలికలపై ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ఆలోచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటికే పలు శాఖలకు వివిధ ఆదేశాలు జారీ చేశారు.


అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. పిచ్చి మొక్కలు తొలగింపు...రోడ్లు బాగుచేడంతో పాటు వివిధ పనులు చేపట్టారు. గతంలో జరిగిన నిర్మాణాల వద్ద పనులు మొదలయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు కీలక శాఖల అధికారులు సిద్ధం అవుతున్నారు. పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో నివేదికలను ఇరిగేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో ట్రాన్స్ కో, జెన్ కోలలో పరిస్థితిపై చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కనీసం వీధిదీపాలు వెలగని పరిస్థితిని తెలుసుకుని వెంటనే చక్కదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యంపై దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించారు. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులకు అస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.


విజయవాడలో కొద్దిరోజుల క్రితం కలుషిత తాగునీటితో మరణాల నేపథ్యంలో తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సాగు నీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత సమాచారాన్ని చంద్రబాబు తెప్పించుకున్నారు. ఏ మాత్రం సమయం వృథా చేయకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. వీఐపీ రాకపోకల పేరుతో ట్రాఫిక్ నిలిపివేత వంటి చర్యలు వద్దని ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ప్రజలు ఇబ్బంది పడేలా ట్రాఫిక్ ఆపోద్దని ఇప్పటికే చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోజుల వ్యవధిలోనే పాలనలో మార్పు చూపించాలనే అభిప్రాయంతో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు, నిర్ణయాలు ఉండనున్నాయని సమాచారం.

Updated Date - Jun 09 , 2024 | 08:00 PM