Share News

AP Elections 2024:ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు జగన్ వారిని దింపారు: చినరాజప్ప

ABN , Publish Date - May 06 , 2024 | 10:32 PM

ఏపీలో అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప నుంచి మనుషులను పంపారని కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప (Chinarajappa) మండిపడ్డారు. పెద్దాపురం మండలం అనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

AP Elections 2024:ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు జగన్ వారిని దింపారు: చినరాజప్ప
Chinarajappa

కాకినాడ: ఏపీలో అన్ని నియోజకవర్గాలకు ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప నుంచి మనుషులను పంపారని కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప (Chinarajappa) ఆరోపించారు. పెద్దాపురం మండలం అనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ...పెద్దాపురం నియోజకవర్గంలో కడప నుంచి సుమారు 160 మందిని లాడ్జుల్లో దింపారని ఆరోపించారు. బస చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం ఎన్నికల కమిషన్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అన్నారు.


ఇక్కడ ఎవరూ లేరని చెప్పి ఎన్నికల కమిషన్‌ను పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. కడప నుంచి వచ్చిన వారు ఎక్కడెక్కడ బస చేస్తున్నారో ఆధారాలతో నిరూపిస్తానని సవాల్ విసిరారు. వాళ్లు ఎక్కడున్నారో చూపించడానికి తాము సిద్ధమని... ఆధారాలతో మరోసారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. పోలీసులు పట్టించుకోకపోతే నియోజకవర్గంలో ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉందన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు తొత్తుగా వ్యవహరించి సామాన్యులపైన, టీడీపీ నాయకులపైన తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేశారని ఫైర్ అయ్యారు. అందువల్లే ఎన్నికల కమిషన్ డీజీపీపై వేటు వేసిందని చినరాజప్ప పేర్కొన్నారు.

Nara Lokesh: విశ్వజిత్‌గా నరేంద్ర మోదీ

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 06 , 2024 | 10:48 PM