Share News

AP Election 2024: మాకు వచ్చే సీట్లు ఇవే.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 24 , 2024 | 08:18 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) తాము 175 స్థానాల్లో గెలుస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లాలో మరోసారి తొమ్మిదికి తొమ్మిది గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

AP Election 2024: మాకు వచ్చే సీట్లు ఇవే.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
Botsa Satyanarayana

విజయనగరం: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) తాము 175 స్థానాల్లో గెలుస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లాలో మరోసారి తొమ్మిదికి తొమ్మిది గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగానే అమలు చేశామని తెలిపారు.


వృద్ధులకు ఫించన్లు ఇవ్వొద్దని లేఖ రాసి వారి ప్రాణాలను టీడీపీ పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. ధనవంతులు, బలవంతులు, డబ్బున్నవారే చంద్రబాబుకు కావాలని విమర్శించారు. ఎనిమిది ప్రాంతాల్లో వైసీపీ అరాచకాలు చేస్తే మిగతా చోట్ల ఎవరు చేశారు? అని ప్రశ్నించారు. ఏ ప్రాంతాల్లో పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేశారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు.


టెక్కలిలో టీడీపీ నాయకులు వైసీపీ ఏజెంట్లపై దాడి చేశారని మండిపడ్డారు. టీడీపీ అధినేత ఎన్నికలయిన దగ్గరి నుంచి కనిపించటం లేదని ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Updated Date - May 24 , 2024 | 08:45 PM