Share News

AP Politics: ఆహా.. ఏం చెప్పారు జగన్ గారూ..!

ABN , Publish Date - Apr 17 , 2024 | 10:49 AM

‘ఆయన విలువలున్న వ్యక్తి. ఈయన మనసేమో వెన్న, ఇంకొకాయన లోకల్‌ హీరో’ అంటూ తమ పార్టీ అభ్యర్థులను జగన్‌ (YS Jagan) పరిచయం చేస్తుంటే వారి చరిత్ర తెలిసిన జనం విస్తుబోయారు. భీమవరం(Bhimavaram) సభలో తన ప్రసంగం పూర్తయ్యాక నరసాపురం(Narasapuram) ఎంపీ అభ్యర్థిని, ఏడు అసెంబ్లీ అభ్యర్థులను సీఎం పరిచయం చేస్తూ పొగడ్తలతో ముంచెత్తారు.

AP Politics: ఆహా.. ఏం చెప్పారు జగన్ గారూ..!
YS Jagan

అమరావతి, ఏప్రిల్ 17: ‘ఆయన విలువలున్న వ్యక్తి. ఈయన మనసేమో వెన్న, ఇంకొకాయన లోకల్‌ హీరో’ అంటూ తమ పార్టీ అభ్యర్థులను జగన్‌ (YS Jagan) పరిచయం చేస్తుంటే వారి చరిత్ర తెలిసిన జనం విస్తుబోయారు. భీమవరం(Bhimavaram) సభలో తన ప్రసంగం పూర్తయ్యాక నరసాపురం(Narasapuram) ఎంపీ అభ్యర్థిని, ఏడు అసెంబ్లీ అభ్యర్థులను సీఎం పరిచయం చేస్తూ పొగడ్తలతో ముంచెత్తారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను లోకల్‌ హీరో అంటూ ఆకాశానికి ఎత్తేశారు. కానీ, ప్రత్యర్థులను రాజకీయంగా అణగదొక్కడం.. ఆర్థిక మూలాలను దెబ్బ తీయడం.. ప్రతిపక్షాలపై దాడులకు ఉసిగొల్పడంతోపాటు, బెదిరింపులకు పాల్పడుతుంటారని శ్రీనివాస్‌పై ఆరోపణలున్నాయి. తాడేపల్లిగూడెం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను మాట కటువుగా ఉన్నా.. మంచి వాడిగానూ, విలువలున్న వ్యక్తిగా జగన్‌ పరిచయం చేశారు.

కానీ ఆయన నియోజకవర్గంలో గడిచిన ఐదేళ్లలో దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్షాలకు ఇప్పుడవే అస్త్రాలయ్యాయి. తణుకు నియోజక వర్గానికి ప్రాతినిఽథ్యం వహిస్తున్న పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మనసు వెన్న అంటూ జగన్‌ పొగిడారు. కానీ తన మాట వినని అధికారులపైనా, కార్యకర్తలపైనా ఒంటి కాలిపై మంత్రిలేస్తారంటూ తణుకులో నానుడి. ఉండి అభ్యర్థి పీవీఎల్‌ నరసింహ రాజును మంచి వ్యక్తిగా అభివర్ణించారు. నర్సాపురం అభ్యర్థి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాద్‌రాజు మంచి చేస్తాడు. నాకు మంచి స్నేహితుడు. మళ్లీ గెలిపిస్తే ఇంకా మంచి చేస్తాడంటూ జగన్‌ సభకు వివరించారు. ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు కూడా మంచివాడు, సౌమ్యుడని పొగడ్తలతో ముంచెత్తారు.

మరిన్ని ఆంధ్రజ్యోతి వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 10:49 AM