Share News

Purandeshwari: సీఎం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు.. సీఈవోకు పురందేశ్వరి లేఖ

ABN , Publish Date - Apr 02 , 2024 | 02:43 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని సీఈవో ఎంకే మీనాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లేఖ రాశారు. రాజకీయ పార్టీలు విమర్శలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని ఎన్నికల పరివర్తనా నియమావళి చెబుతోందన్నారు.

Purandeshwari: సీఎం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు.. సీఈవోకు పురందేశ్వరి లేఖ

అమరావ‌తి, ఏప్రిల్ 2: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని సీఈవో ఎంకే మీనాకు (CEO MK Meena) బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) లేఖ రాశారు. రాజకీయ పార్టీలు విమర్శలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని ఎన్నికల పరివర్తనా నియమావళి చెబుతోందన్నారు. గత నెల 27న పొద్దుటూరులో నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో విశాఖలో డ్రగ్స్‌తో కలిసి ఉన్న్ కంటెయినర్‌పై సీఎం మాట్లాడారన్నారు. ఆ కంటెయినర్‌ తెప్పించిన సంధ్య ఆక్వా ఎక్స్‌‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తమ కుటుంబసభ్యులు, బంధువులు, ఆ కంపెనీలో పార్టనర్‌లుగా ఉన్నారని ఆరోపించారన్నారు.

Big Breaking: కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడుతున్న అరెస్టులు!


‘‘అయితే నాకు గానీ, నా కుటుంబ స‌భ్యుల‌కు గానీ ఆ కంపెనీతో ఎలాంటి సంబంధలేదు. మా బంధువులు ఎవరూ ఆ కంపెనీలో డైరెక్టర్‌లుగా లేరు. అయినా దీనిని త‌మ‌కు ఆపాదిస్తూ సీఎం చేసిన ప‌బ్లిక్ స్టేట్మెంట్‌పై ఇప్పటికే జగన్‌మోహన్‌రెడ్డికి లీగల్ నోటీసు పంపాం. వైసీపీ అధ్యక్షుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా ఆయ‌న చేసే ప్రకటనలు నీతివంతంగా, న్యాయ‌బ‌ద్ధంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. నిజానికి త‌న‌పై ఆరోప‌ణ‌లు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆయ‌న చేశారు. కాబ‌ట్టి ఆయ‌న‌పై ఎన్నిక‌ల ప్రవర్తనా నియమావళి ఆధారంగా చర్యలు తీసుకోవాల‌ని కోరుతున్నాము’’ అని పురందేశ్వరి లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

AP News: వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించడమే టీడీపీ కార్యకర్త చేసిన పాపం.. నందిగామలో దారుణం

Lok Sabha Electons: హస్తినలో 7 ఎంపీ సీట్లు మళ్లీ బీజేపీకే..!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2024 | 02:46 PM