Share News

Lok Sabha Electons: హస్తినలో 7 ఎంపీ సీట్లు మళ్లీ బీజేపీకే..!

ABN , Publish Date - Apr 02 , 2024 | 02:39 PM

లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ ఈసారి కూడా ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోనుంది. 'ఇండియా టీవీ-సీఎన్ఎక్స్' ఒపీనియన్ పోల్ ఈ వివరాలను వెల్లడించింది. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి ప్రభావం కానీ, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం కానీ పెద్దగా ఉండకపోవచ్చని ఒపీనియన్ పోల్ జోస్యం చెప్పింది.

Lok Sabha Electons: హస్తినలో 7 ఎంపీ సీట్లు మళ్లీ బీజేపీకే..!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections-2024) 400కు పైగా సీట్లలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ (BJP) ఈసారి కూడా ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోనుంది. 'ఇండియా టీవీ-సీఎన్ఎక్స్' ఒపీనియన్ పోల్ ఈ వివరాలను వెల్లడించింది. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి ప్రభావం కానీ, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం కానీ పెద్దగా ఉండకపోవచ్చని ఒపీనియన్ పోల్ (Openion poll) జోస్యం చెప్పింది.


2019 ఎన్నికల్లో...

ఢిల్లీలో చాందీనీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, న్యూఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. చాందినీ చౌక్‌లో బీజేపీ అభ్యర్థిహర్ష వర్ధన్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి జై ప్రకాష్ అగర్వాల్‌పై 2,28,145 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి కాంగ్రెస్ అభ్యర్థి షీలా దీక్షిత్‌పై 3,66,102 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ కాంగ్రెస్ అభ్యర్థి అర్వీందర్ సింగ్ లవ్లీపై 3,91,22 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్‌పై 2,56,504 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నార్త్ వెస్ట్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి హన్స్‌రాజ్ తన సమీప ఆప్ అభ్యర్థి గుగన్ సింగ్ రంగాపై 5,53,897 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వెస్ట్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కాంగ్రెస్ అభ్యర్థి మహాబల్ మిశ్రాపై 5,78,486 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సౌత్ ఢిల్లీలో బీజేపీ అభ్యరథి రమేష్ బిదూరి తన సమీప ఆప్ అభ్యర్థి రాఘవ్ చద్దాపై 3,67,043 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 03:20 PM