Share News

AP NEWS: ఆ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కొత్తపల్లి గీత

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:43 PM

కొంతమంది తన కులంపై ఆరు నెలల నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ, ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి గీత(Kothapalli Geetha) అన్నారు.

AP NEWS: ఆ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కొత్తపల్లి గీత

తూర్పుగోదావరి: కొంతమంది తన కులంపై ఆరు నెలల నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ, ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి గీత(Kothapalli Geetha) అన్నారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ... తాను వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని.. తన కులానికి సంబంధించిన ప్రభుత్వ గెజిట్ కూడా తన వద్ద ఉందని స్పష్టం చేశారు. బీజేపీ‌కి చెందిన కేకేవీవీ సత్యనారాయణ రెడ్డి, నిమ్మక జయరాజులు తనపై తప్పుడు ప్రచారం చేసి మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జయరాజు ఆదివాసీ సొసైటీ ఏర్పాటు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వాపోయారు. ఆదివాసీ సొసైటీపై న్యాయ విచారణ కోరుతున్నానని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనను మానసికంగా వేధిస్తూ బెదిరిస్తున్నారన్నారు. బ్యాంకులో రూ. 25 కోట్లు అప్పు తీసుకొని వడ్డీతో సహా రూ.65 కోట్లు బ్యాంక్‌కు చెల్లించినట్లు తేల్చిచెప్పారు. బ్యాంక్ అధికారులు కూడా నో డ్యూస్ సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పారు. బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టినట్లు తనపై అవాస్తవాలు మాట్లాడి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సత్యనారాయణ రెడ్డి, జయరాజులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు కొత్తపల్లి గీత తెలిపారు.

Updated Date - Feb 13 , 2024 | 03:56 PM