Share News

CM Jagan: తూ.గో. జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు

ABN , Publish Date - Apr 18 , 2024 | 07:57 AM

తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ ఉదయం 9 గంటలకు తణుకు జాతీయ రహదారి మీదుగా సిద్దాంతం బ్రిడ్జ్ నుంచి రావులపాలెం, జొన్నాడ సెంటర్, చెముడులంక, పొట్టిలంక చేరుకుంటారు.

CM Jagan: తూ.గో. జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు

తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari Dist.)లో సిద్ధం బస్సు యాత్ర (Siddam Bus Yatra) నిర్వహిస్తారు. ఈ ఉదయం 9 గంటలకు తణుకు జాతీయ రహదారి మీదుగా సిద్దాంతం బ్రిడ్జ్ నుంచి రావులపాలెం, జొన్నాడ సెంటర్, చెముడులంక, పొట్టిలంక చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తూర్పుగోదారి జిల్లా కడియపులంకలో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బొమ్మూరు జంక్షన్ మీదుగా తాడితోట, దేవిచౌక్ సెంటర్, సీతంపేట మీదుగా దివాన్ చెరువు వరకు రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు రాజానగరం సమీపంలో ఎస్టీ రాజాపురంలో సీఎం జగన్ బస చేస్తారు.


కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దగా తప్ప.. బాగుపడ్డ జీవి తాలు కనుచూపు మేరలో కానరాని పరిస్థితిని జనం చూశారు. జగన్‌ సీఎం అయ్యాక స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలపై చర్చించడం మాట తర్వాత సంగతి.. అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా తూర్పు గోదా వరికి ఆయన ‘గాలి’ సోకలేదు. జిల్లా కేంద్రమైన రాజమ హేంద్రవ రానిది ఎప్పుడూ అటు రాజకీయంగా.. ఇటు వాణిజ్యపరంగా ప్రధాన స్థానమే. అయి నా అభివృద్ధి, నిధుల విడుదలలో తగిన ప్రాధాన్యం దక్కలేదు. నగరపాలక సంస్థ సాధారణ నిధులతో ‘షో’కు చేశారు. గ్రా మాల్లో పంచాయతీ నిధులే దిక్కయ్యాయి. కరెంటు బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో పంచాయతీల్లోని వీధి దీపాలకు, తాగునీటి సరఫరాకు కరెంటును నిలిపివేసే దుస్థితి దాపురించింది. ప్రకృతి వరప్రసాదిని అయిన గోదావరి నది చెంతనే ఉన్నా తాగునీటికి జనావాసాలు కటకటలాడుతున్నాయి. నగరాన్ని పట్టిపీ డిస్తున్న డ్రైనేజీ సమస్య అలాగే ఉంది. ఈ పాలకులు చివరికి ట్రాఫిక్‌నీ దారిలో పెట్టలేకపోయారు. శివారు ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్లు లేవు. ఈ ఎన్నికల నాటికి మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తానని.. లేకపోతే ఓటు అడగనని గత ఎన్నికల్లో చెప్పిన జిల్లాలోని మద్యం అమ్మకాలను నెలకు రూ.100 కోట్లు దాటించారు. ‘జే’ బ్రాండ్లతో జనం ఆరోగ్యాలను పిండేశారు. ఈ ఐదేళ్లలో ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేకపోయినా జగన్‌ మళ్లీ ఓట్ల కో సం రోడ్డు ‘షో’ నిర్వహించడం విడ్డూరంగా ఉందంటూ ప్రజలు విస్తు పోతు న్నారు. ఈసారి పంకాను చెత్తబుట్టలో పడేయడానికి ‘సిద్ధం’ అంటున్నారు.


తూర్పుపై చిన్నచూపే

తూర్పుగోదావరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో ఐదింటిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండగా రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా అభివృద్ధి ఊసు లేకపో గా సిటీ, రూరల్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు కావడంతో జగన్‌ మరీ దారుణంగా ముఖం చాటేశారు. సిటీ, రూరల్‌కి ఇన్నేళ్లలో చెప్పుకోదగిన స్థాయి లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. ఒక్క పెద్ద ప్రాజెక్టు కూ డా చేపట్టలేదు. ఎన్నికలవేళ దగ్గర పడుతుండగా హ డావుడిగా ప్రా రంభోత్సవాలు మాత్రం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతంలోని పర్యాటకం గురకపెట్టి నిద్దరోయింది. నగరంలోని గోదా వరి గట్టును కూడా అభివృద్ధి చేయలేకపోయారు. పాత బ్రిడ్జిని పర్యాటక ప్రాంతంగా మారు స్తామనే మాట మరిచి సీరియల్‌ సెట్ల లైటింగ్‌తో సరిపెట్టారు. పిచ్చుక లంకను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని టీడీపీ హయాంలో పనులు ప్రారంభించగా వైసీపీ వచ్చాక వాటిని ఆపే శారు. ఆధ్యాత్మికపరంగా ఉమ్మడి తూర్పుగోదావరిలో పురాతన, ప్రాశస్తి కలిగిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిని టీడీపీ టెంపుల్‌ సర్క్యూట్‌ పేరుతో అభివృద్ధి చేయాలని ఆలోచన చేయగా వైసీపీ వచ్చాక అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాజమహేంద్రవరం రూరల్‌ పరిధిలో ఇప్పటికీ వాటర్‌ ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేసే దుస్థితి ఉంది. టీడీపీ హయాంలో ప్రారంభించిన పరిశ్రమలు వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూత పడడంతో సుమారు 50వేల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ఐదేళ్లపాటు సర్కారీ కొలువులకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా జగన్‌ ఇవ్వక పోవడంతో యువత అల్లాడిపోతున్నారు. మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా మెగా డీఎస్పీ పేరుతో దగా నోటిఫికేషన్‌ని ఇచ్చారు. దానిలో జిల్లాకు కేవలం 200లోపు మార తమే ఉద్యోగాలు కేటాయించా రు. రాజమహేంద్ర వరంలో రోజుకు సుమారు 80-100 మిలియన్‌ లీటర్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతుంటే.. 30ఎంఎల్‌ డీ మాత్రమే శుద్ధి చేసే సదు పాయం ఉంది. అది కూడా సవ్యంగా పనిచేసి న దాఖలాలు లేవు. ఈ 4ఏళ్ల 10నెల ల్లో మురుగునీటి శుద్ధి సామ ర్ధ్యాన్ని కూడా వైసీపీ పాలకులు పెంచలేకపోయారు.


జగన్‌ వస్తున్న దారిలో..

జగన్‌ తన రోడ్డు షోలో భాగంగా జిల్లాలోకి పొట్టిలంక వద్ద ప్రవేశించ నున్నారు. అక్కడి నుంచి వేమగిరి వరకూ ఉన్న పువ్వుల నర్సరీలు ఈ ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిపెడుతున్న వాటిలో ప్రముఖంగా నిలుస్తాయి. వేలాదిమంది ఈ నర్సరీలపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి నర్సరీల కు టీడీపీ హయాంలోనే ఉచిత విద్యుత్‌ సదుపాయం కల్పించారు. ఎగు మతులను ప్రోత్సహించారు. అయితే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక నర్సరీల కు ఒరిగిందేమీ లేదనే చెప్పొచ్చు. హైవేపై వేమగిరి జంక్షన్‌ ముఖ్య మైనది. ఇక్కడ నాలుగు ప్రధాన రహదార్లు కలుస్తాయి. ఈ ప్రదేశం అభివృద్ధి మరిచారు. మోరంపూడి జంక్షన్‌లోని ఇప్పుడు జరుగుతున్న ఫ్లైఓవర్‌ టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పట్లో ఎన్నికలు రావడం.. తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం జరిగి ంది. దీంతో మరింత ఆలస్యమైంది. నాలుగేళ్ల తర్వాత పనులు ప్రారంభ మయ్యాయి. రాజానగరం నియోజకవర్గంలో జూనియర్‌ కళాశాల హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ఈ నియోజకవర్గంలో అధికశాతం రోడ్లు, డ్రైన్లు టీడీపీ హయాంలోనే పూర్తయ్యాయి. దీంతో హంగు కోసం కొన్ని ప్రారం భోత్సవాలను చేశారు. గత నెల 12న కలవచర్లలో పారిశ్రామికవాడకు కొబ్బరికాయ కొట్టారు. కార్యరూపం ఎప్పుడు దాలుస్తుందో వేచి చూడాల్సిందే.


గామన్‌ బ్రిడ్జినీ కుంగదీశారుగా..

వైసీపీ నాయకుల ఇసుకాశవల్ల రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరిపై నాలుగో వంతెన(గామన్‌ బ్రిడ్జి)కు ముప్పు ముంచుకొచ్చింది. కోర్టు తీర్పులను లెక్కచేయకుండా, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలకు తిలోదకాలిచ్చి గోదావరి నదీగర్భానికి శోకం మిగిల్చి వైసీపీ నాయకులు ఇసుక దందా సాగించారు. గోదావరిలో ఇష్టానుసారం ఇసుక డ్రెడ్జింగ్‌ చేసి పర్యావరణానికి ముప్పుతెచ్చి వేల కోట్ల రూపాయలు బొక్కేశారు. బ్రిడ్జి స్పాన్‌(స్తంభం) నుంచి 500 మీటర్ల వరకూ ఇసుక వెలికి తీయకూ డదనే నిబంధనను గోదాట్లో కలిపేశారు. బ్రిడ్జిల స్పాన్లకు సమీపాన ఇసుక తవ్వేయడంతో గామన్‌ బ్రిడ్జికి ముప్పు వాటిల్లింది. రోడ్డు కం రైలు బ్రిడ్జి సమీపంలో కూడా ఇసుకను తవ్వేస్తున్నారంటూ రైల్వే పోలీసులు ఓ సారి ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు నివేదించారు.


నగరంలో ట్రాఫిక్‌ నరకం

జిల్లాలో ట్రాఫిక్‌ తలపోటుగా మారి నియంత్రణ కోల్పోయింది. జిల్లా బాస్‌లు నిత్యం సంచరించే జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో మరీ అస్తవ్యస్తంగా మారింది. ట్రాఫిక్‌ నియంత్రణలో ప్రధాన భూమిక పోషించే సిగ్నల్స్‌ వెలిగితే వాహనదారుల అదృష్టమనేంత దారుణంగా పరిస్థితి నిర్ల క్ష్యాన్ని వెక్కిరిస్తోంది. ఓ వైపు జాతీయ, రాష్ట్ర రహదారులపై బ్లాక్‌ స్పా ట్స్‌ జనాల ప్రాణాలను మింగేయడానికి నోర్లు బార్లా తెరుచుకొని చూస్తుంటే.. మరోవైపు నగరాలు/పట్టణాల్లో దారితప్పిన ట్రాఫిక్‌ వాహనదారులను ప్రమాదాలబారిన పడేస్తోంది. హైవేలో, సిటీలో, పట్టణాల్లో.. ఎక్కడ రోడ్డుపై కి వచ్చినా ఇంటికి క్షేమంగా వెళ్తామన్న గ్యారెంటీ లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపానికి నిధుల లేమి జత చేరడం జనాల పాలిట శాపంగా దాపురించింది. వైసీపీ నాయకులు ప్రచార ఆర్భాటానికి జంక్షన్ల వద్ద అభివృద్ధి పేరుతో చేస్తున్న పనులు రోడ్డును కుచించుకు పోయేలా చేసి ట్రాఫిక్‌ తిప్పలను ఎక్కువ చేస్తున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పుడు జగన్‌ కాన్వాయ్‌ వెళ్లే దారులు కూడా వైసీపీ వచ్చాక ఇరుకుగా చేసినవే.


అభివృద్ధి పేరుతో కుచించి..

ఎక్కడైనా ట్రాఫిక్‌ పెరిగితే ఇబ్బందులు అధిగమించడానికి రోడ్లు, కూడళ్లు వెడల్పు చేస్తారు. కానీ, జిల్లాలో అందుకు భిన్నంగా ప రిస్థితులు కనిపిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో రోడ్లు, జంక్షన్లను కుచించుకుపోయేలా చేస్తున్నా రు. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగిపోయా యి. వాటికి అస్తవ్యస్త సిగ్నల్స్‌ నిర్వహణ మరిం త ఆజ్యం పోస్తోంది. ఉదాహరణకు రాజమహేంద్రవరంలో కంబాల చెరువు, ఐటీ ఆఫీస్‌ ఏరియాల్లో జంక్షన్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో చేసిన పనుల వల్ల వాహనదారుల ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. కంబా ల చెరువు నుంచి లాలా చెరువు వరకూ ఫుట్‌పాత్‌లపై బిళ్లలు అతికించి పూల కుండీలు ఏర్పాటు చేశారు. దీంతో చిరువ్యాపారులు రోడ్డుపైకి రాక తప్పలేదు. అసలే ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ఈ రహదారి ప్రమాదకరంగా మారింది. అన్నట్లు.. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగమైన పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టంలు ఎప్పుడో పడకేసేశాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

నంద్యాల జిల్లా: ఆత్మకూరులో భారీ అగ్ని ప్రమాదం

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 08:01 AM