Share News

AP NEWS: బాబోయ్ సీఎం జగన్ సభ.. ఆంక్షలతో ప్రజలకు ఇబ్బందులు

ABN , Publish Date - Feb 02 , 2024 | 10:01 PM

ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద రేపు(శనివారం) నాడు వైసీపీ ‘సిద్ధం’ ఎన్నికల సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సభకు వైసీపీ అధినేత, సీఎం జగన్(CM JAGAN) హాజరుకానున్నారు.

AP NEWS: బాబోయ్ సీఎం జగన్ సభ.. ఆంక్షలతో ప్రజలకు ఇబ్బందులు

ఏలూరు: ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద రేపు(శనివారం) నాడు వైసీపీ ‘సిద్ధం’ ఎన్నికల సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సభకు వైసీపీ అధినేత, సీఎం జగన్(CM JAGAN) హాజరుకానున్నారు. అధికార పార్టీ భారీగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. సభా ప్రాంగణం వద్ద సీతంపేట ఛానల్‌ను వైసీపీ నాయకులు మట్టితో పూడ్చేశారు. జనం రాకపోకలకు వీలుగా ఛానల్‌ను మూసివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మీటింగ్‌కు వెళ్లే రహదారిపై ఎక్కడికక్కడ చెట్లను వైసీపీ శ్రేణులు నరికేశారు. చెట్లను నరికేసి వైసీపీ జెండాలను ఆ పార్టీ నేతలు కట్టారు. ఏలూరులో రోడ్డు డివైడర్ల మధ్యలో ఉన్న చెట్లను నరికివేశారు. వైసీపీ నేతల చేష్టలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం సభ సందర్భంగా రేపు జరగాల్సిన ఇంటర్ మీడియట్ పరీక్షను ఏపీ వ్యాప్తంగా అధికారులు వాయిదా వేశారు. రేపు(శనివారం) నాడు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల బస్సులను జనాన్ని తరలించడానికి వైసీపీ ప్రజా ప్రతినిధులు సమీకరించారు.

Updated Date - Feb 02 , 2024 | 10:12 PM