Share News

AP Politics: వైసీపీకి భారీ షాక్.. ఒకే రోజు టీడీపీలోకి ఇంతమంది నేతలా..?

ABN , Publish Date - Mar 04 , 2024 | 08:01 PM

AP Elections 2024: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాలకు జిల్లాలే వైసీపీ పార్టీ ఖాళీ అవుతోంది. ఇక ఆ పార్టీలో ఇమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నారు...

AP Politics: వైసీపీకి భారీ షాక్.. ఒకే రోజు టీడీపీలోకి ఇంతమంది నేతలా..?

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాలకు జిల్లాలే వైసీపీ పార్టీ ఖాళీ అవుతోంది. ఇక ఆ పార్టీలో ఇమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం (TDP) పార్టీవైపు చూస్తున్నారు. తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి సుధారాణి నేతృత్వంలో వివిధస్థాయిల వైసీపీ నాయకులు యువనేత లోకేష్ (Nara Lokesh) సమక్షాన సోమవారం టీడీపీలో చేరారు. 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కన్వీనర్లతో సహా 150 మంది పార్టీ ముఖ్యనేతలు సోమవారం రాత్రి.. భారీ కాన్వాయ్‌తో ఉండవల్లిలోని చంద్రబాబు వద్దకు నివాసానికి చేరుకున్నారు. వారందరికీ యువనేత లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలసి పనిచేసేవారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చినవారిని కలుపుకొని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషిచేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో ఎస్.కోట ఎంపీపీ సంధి సోమేశ్వరరావు, ఎంపీటీసీ లాగుడు లక్ష్మి, ఎంపీటీసీ మోపాడ గౌరీశ్వరి, ఎంపీటీసీ-1 దారా గిరి, ఎంపీటీసీ-2 మజ్జి దేవి, ఎంపీటీసీ-4 వాకాడ సింహాచలం, ఎంపీటీసీ-5 మోపాడ సునీత, ఎంపీటీసీ-6 బి.ఆదిలక్ష్మి, ఎంపీటీసీ భోజంకి వెంకటలక్ష్మి, మండల కో-ఆప్షన్ మెంబర్ షేక్ బషీర్, సర్పంచ్‌లు సోలుబొంగు కనకం, రామకృష్ణ, సంతోషి కుమారి, వొబ్బిన త్రినాథమ్మ, లాగుడు సూర్యనారాయణ, ఎర్ర సన్యాసిరావు తదితరులు ఉన్నారు.


Sudha-Rani.jpg

ఎస్.కోటను కబ్జాలకోటగా మార్చారు

ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నియోజకవర్గాన్ని కబ్జాల కోటగా మార్చేశారని.. సుధారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన తర్వాత సుధారాణి మాట్లాడుతూ.. ‘ వైసీపీలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు అక్కడ ఎలాంటి ఆత్మగౌరవం లేదు. మా సమస్యలను జగన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కబ్జాల కడుబండిగా పేరు గడించారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఇక్కడకు వచ్చాం. ఇక్కడ కార్యకర్తలకు గౌరవం ఉంటుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తాం. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో మా ప్రాంతం అభివృద్ధి చెందగలదు’ అని విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.

Nara-Lokesh.jpg

అందరం కలసి అభివృద్ధి చేసుకుందాం

గత ఎన్నికల్లో జగన్ ను ప్రజలు నమ్మి 151 సీట్లతో అధికారమిస్తే కోట్లాది ప్రజల ఆశలు, ఆశయాలకు గండికొడుతూ...ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనను ప్రారంభించారని యువనేత లోకేష్ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాను. వారి కష్ట, సుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తా. చంద్రబాబునాయుడు గారు వస్తున్నా మీకోసం పాదయాత్రలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకొని 2014-19 నడుమ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పాదయాత్ర చేసిన జగన్ ప్రజలకు మంచి చేస్తాడని అందరూ భావిస్తే ఆయన మాత్రం విధ్వంసం, వేధింపులు, కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ పాలనలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. టిడిపి-జనసేన ప్రభుత్వం వచ్చాక సర్పంచ్ లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు తగిన గౌరవంతోపాటు గౌరవ వేతనం పెంచుతాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. శంఖారావం కార్యక్రమంలో భాగంగా శృంగవరపుకోట నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నా. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం. ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకువచ్చి స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పిస్తాం. ఉత్తరాంధ్రకు పూర్వవైభవం తీసుకువస్తాం. టిడిపిలో పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని లోకేష్ పేర్కొన్నారు.

YSRCP-To-TDP.jpg

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2024 | 08:03 PM