Share News

AP News: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ సూపరింటెండెంట్ సస్పెండ్.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:28 PM

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం(Dwarka Tirumala China Venkanna temple) లో ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఓ ఉద్యోగిని సస్పెండ్ చేసి, సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేసి, పలువురు సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు.

AP News: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ సూపరింటెండెంట్ సస్పెండ్.. కారణమిదే..?

ఏలూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం(Dwarka Tirumala China Venkanna temple) లో ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఓ ఉద్యోగిని సస్పెండ్ చేసి, సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేసి, పలువురు సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. ద్వారకాతిరుమల దేవస్థానం కేశాఖండనశాలలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు సిద్ధవటం యానాదయ్య ఆధ్వర్యంలో వైసీపీ(YSRCP) ‘సిద్ధం’ పేరుతో ముద్రించిన కరపత్రాలను అక్కడ విధులు నిర్వహిస్తున్న క్షురకులకు పంపిణీ చేశారు. ఆ కరపత్రాలను క్షురకులు చేతితో పట్టుకొని ఫొటోలు దిగి దేవస్థానంలో ప్రచారం చేశారు.

సాధారణంగానే ఏదైనా పార్టీకి చెందిన కార్యక్రమాలను దేవస్థానంలో ప్రచారం చేయడం నిషేధం.. అందులోనూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఓ పార్టీకి చెందిన కరపత్రాలు పంపిణీ చేయడం పట్ల స్థానిక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఘటనపై స్పందించిన ఆలయ ఈవో త్రినాధరావు కేశఖండనశాల సూపరిండెంట్‌ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక సంబంధిత ఏఈఓను సంజాయిషీ కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అలాగే కేశఖండనశాలలో వైసీపీ కరపత్రాలను చూపుతూ ఫొటోలు దిగిన క్షురకులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు ఆలయ ఈవో త్రినాధరావు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 10:28 PM