Share News

Dadi Veerabhadrarao: వారు విశాఖను డ్రగ్స్ అడ్డాగా మారుస్తున్నారు

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:51 PM

విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ లభించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు(Dadi Veerabhadrarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయల మత్తు పదార్థాల వ్యాపారి సంధ్య అక్వా ఎక్స్‌పోర్ట్స్ యజమానులను ఉరితీయాలని హెచ్చరించారు. మానవత్వం లేని ఈ మృగాలను, వారికి దన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకులను శిక్షించాలని అన్నారు.

Dadi Veerabhadrarao: వారు విశాఖను డ్రగ్స్ అడ్డాగా మారుస్తున్నారు

అనకాపల్లి జిల్లా: విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ లభించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు(Dadi Veerabhadrarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయల మత్తు పదార్థాల వ్యాపారి సంధ్య అక్వా ఎక్స్‌పోర్ట్స్ యజమానులను ఉరితీయాలని హెచ్చరించారు. మానవత్వం లేని ఈ మృగాలను, వారికి దన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకులను శిక్షించాలని అన్నారు. ఎన్నికల్లో యువతకు మత్తుమందు పంచి ఓట్ల కోసం ప్రలోభాలకు గురిచేస్తారని అపోహలు వినిపిస్తునందున ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన భయంకరమైన మత్తు పదార్థాలను బ్రెజిల్ నుంచి విశాఖపట్టణానికి తీసుకొచ్చిన కంటైనర్‌ను ఇంటర్ పోల్ సహాయంతో స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులను అభినందించాలని తెలిపారు.

సీబీఐ న్యాయమూర్తి సమక్షంలో కొన్ని ప్యాకింగులను తెరిచి వాటిలో కొకైయిన్ ఉన్నట్టు గమనించారని అన్నారు. దూర ప్రాంత జిల్లాల నుంచి వచ్చిన నేరస్థులు విశాఖపట్టణాన్ని నేరాల అడ్డాగా మారుస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ అధికారులు నేర పరిశోధన జాగిలాలను పంపమని కోరినపుడు విశాఖ పోలీస్ కమిషనర్ ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో చొరబడటానికి ఎందుకు ప్రయత్నించారో ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు. అక్వా కంపెనీ నిర్వాహకులు స్వయంగా అక్కడికి హాజరై కంటైయినర్‌ను తెరవకుండా అడ్డుకున్నారంటే వారి వెనుక బలమైన రాజకీయ, పోలీసు యంత్రాంగాలు ఉన్నట్టు అర్థమవుతుందని చెప్పారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు విశాఖ నుంచి వెళ్లిన మత్తు పదార్థాలే సమాజాన్ని నాశనం చేస్తున్నాయంటే ఇక్కడ కట్టుదిట్టమైన పరిపాలనా వ్యవస్థ లేనట్టుగా రుజువు అయిందని చెప్పారు. కేంద్ర , రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు ఈ వ్యవహారంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు దాడి వీరభద్రరావు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 09:52 PM