Eluru: అధికార, విపక్షాల వాగ్వాదం.. రసాభాసగా సర్వసభ్య సమావేశం
ABN , Publish Date - Mar 06 , 2024 | 08:45 PM
ఏలూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అధికార పార్టీ సభ్యులు అజెండాను ఏకపక్షంగా ఆమోదించారంటూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఒక కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కోర్టు విచారణలో ఉన్న స్థలాన్ని కేటాయించడంపై రగడ మొదలైంది. కౌన్సిల్ సమావేశంలో..

ఏలూరు జిల్లా: ఏలూరు (Eluru) నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అధికార పార్టీ సభ్యులు అజెండాను ఏకపక్షంగా ఆమోదించారంటూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఒక కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కోర్టు విచారణలో ఉన్న స్థలాన్ని కేటాయించడంపై రగడ మొదలైంది. కౌన్సిల్ సమావేశంలో మేయర్ నూర్జహాన్.. 20 అంశాలను అజెండాగా పెట్టారు.
ఏలూరు 50వ డివిజన్‌లో స్మశానవాటికల అభివృద్ధికి రూ.50లక్షలు కేటాయించడాన్ని టీడీపీ (TDP) కార్పొరేటర్లు తీవ్రంగా తప్పు పట్టారు. వెంకన్న చెరువు శ్మశానవాటిక అభివృద్ధికే కోటి రూపాయల ఖర్చు అవుతుందని, మిగిలిన వాటికి నిధులు ఎలా సరిపోతాయంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లు నిలదీశారు. అయితే దీనిపై వైసీపీ (YCP) కార్పొరేటర్లు స్పందిస్తూ.. పార్టీ మారిన వారికి ప్రశ్నించే హక్కు లేదని అడ్డుకున్నారు. దీంతో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. కేవలం ఓట్ల కోసమే ఇలాంటి తీర్మానాలు చేస్తున్నారని ప్రతిపక్ష సభ్యుల ఆరోపించారు.