Share News

CID: ‘అవి హెరిటేజ్ డాక్యుమెంట్లు కావు’.. సీఐడీ దిద్దుబాటు చర్యలు

ABN , Publish Date - Apr 08 , 2024 | 03:16 PM

Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రాదని తేలిపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఫైళ్ల దగ్ధంపై సీఐడీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. డాక్యుమెంట్ల దగ్ధంపై సిట్ కార్యాలయం వద్ద సీఐడీ వివరణ ఇచ్చింది. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అని పేర్కొంది.

CID: ‘అవి హెరిటేజ్ డాక్యుమెంట్లు కావు’.. సీఐడీ దిద్దుబాటు చర్యలు

అమరావతి, ఏప్రిల్ 8: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్ల (Heritage Documents) దగ్ధం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై టీడీపీ (TDP) ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) అధికారంలోకి తిరిగి రాదని తేలిపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఫైళ్ల దగ్ధంపై సీఐడీ (CID) దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. డాక్యుమెంట్ల దగ్ధంపై సిట్ కార్యాలయం వద్ద సీఐడీ వివరణ ఇచ్చింది. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అని పేర్కొంది.

Janasena: జనసేనకు పోతిన వెంకట మహేష్ గుడ్‌బై.. పవన్‌పై ఘాటు విమర్శలు


తాము 5 కేసుల్లో చార్జిషీటు వేశామని ఒక్కో చార్జిషీట్‌లో ఎనిమిది వేల నుంచి పదివేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని పేర్కొంది. చాలా ఫోటో స్టాట్ కాపీలు తీయాల్సి వస్తుందని ఐజీ తెలిపారు. జిరాక్సులు తీసే సమయంలో ఫోటో స్టాట్ మిషన్ వేడెక్కడం వల్ల పేపర్ స్టక్ అవుతుందని ఇంక్ లెవల్ కూడా తగ్గిపోతుందని వివరణ ఇచ్చారు. దీనివలన కొన్ని కాపీలు సరిగ్గా రావని.. వీటన్నింటిని కూడా వేస్టు పేపర్లుగా గుర్తించి దగ్ధం చేస్తామని వాటి స్ధానంలో ఫ్రెష్ కాపీలు తీసుకుంటామని ఐజీ వెల్లడించారు.

Solar Eclipse 2024: నేటి సూర్యగ్రహణం ఎందుకంత అరుదైనది?.. దీని వెనుకున్న అసలు కారణాలు ఇవే!


అవన్నీ నిరాధారమైనవి...

ఛానల్స్‌లో వస్తున్న వార్తలు నిరాధారమని, భాద్యతారాహిత్యంతో కూడుకున్నవని పేర్కన్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ తాము చట్టవిరుద్ధంగా పొందామని, వాటిని దగ్ధం చేశామని పేర్కొనడాన్ని ఐజీ ఖండించారు. ఇటువంటి చర్యలు దర్యాప్తు బృందాల నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీస్తాయని.. వీటిని కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించి ఐటీ రిటర్న్‌లు తాము సీఆర్పీసీ ప్రోవిజన్ల ప్రకారం అధికారికంగానే తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. మిగతా ఆధారాలు కూడా చట్ట ప్రకారమే పొందామని సీఐడీ స్పష్టం చేసింది. ఈ ఐటీ రిటర్న్‌ల ఆధారంగానే నిందితుడిని ప్రశ్నించామని.. ఈ మెటీరియల్‌ను కూడా హైకోర్టు (AP HighCourt) ముందు ఉంచామని.. ట్రైల్ కోర్టు ముందు కూడా ఉంచామని పేర్కొంది. హెరిటేజ్ కంపెనీ ప్రతినిధుల ద్వారానే ఈ డాక్యుమెంట్లు అన్నీ పొందామని ఐజీ వివరణ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

Janasena: జనసేనకు పోతిన వెంకట మహేష్ గుడ్‌బై.. పవన్‌పై ఘాటు విమర్శలు

Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 04:10 PM