AP NEWS: పుంగనూరులో పోలీసుల అరాచకం.. రామచంద్ర యాదవ్ అరెస్ట్
ABN , Publish Date - Jan 12 , 2024 | 08:32 PM
జిల్లాలోని పుంగనూరులో బీసీవై ( BCY ) పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ( Ramachandra Yadav ) జగన్ ప్రభుత్వం ( Jagan Govt ) నిరంకుశ విధానాలపై శుక్రవారం ధర్మ పోరాట సభకు పిలుపించారు. అయితే సభ వేదిక వద్ద పోలీసులు అరాచకం సృష్టించారు.

చిత్తూరు: జిల్లాలోని పుంగనూరులో బీసీవై ( BCY ) పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ( Ramachandra Yadav ) జగన్ ప్రభుత్వం ( Jagan Govt ) నిరంకుశ విధానాలపై శుక్రవారం ధర్మ పోరాట సభకు పిలుపునిచ్చారు. అయితే సభ వేదిక వద్ద పోలీసులు అరాచకం సృష్టించారు. ధర్మ పోరాట సభకు అనుమతి లేదని వేదిక వద్ద ఉన్న రామచంద్ర యాదవ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ తన వాహనంలోనే రామచంద్ర యాదవ్ కూర్చున్నారు. రామచంద్ర యాదవ్ అనుచరులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు, బీసీవై కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. సభకు అనుమతి లేదని సభా వేదిక దగ్గరకు పోలీసులు భారీగా మోహరించారు. సభా ఏర్పాటును పోలీసులు భగ్నం చేశారు. కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝూళింపించారు. పోలీసుల తీరును నేతలు, కార్యకర్తలు ఖండించారు. పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారి తమపై ప్రతాపం చూపుతున్నారని నేతలు, కార్యకర్తలు ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుకున్న బీసీవై కార్యకర్తలను బలవంతంగా అక్రమ అరెస్టు చేశారు.