Share News

Chandrababu Naidu: ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లింది.. జగన్‌పై విమర్శనాస్త్రాలు

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:16 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కంటే ముందు గొడ్డలి వస్తుందంటూ.. పరోక్షంగా సీఎం హత్యారాజకీయాల్ని ప్రోత్సాహిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

Chandrababu Naidu: ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లింది.. జగన్‌పై విమర్శనాస్త్రాలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరోసారి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కంటే ముందు గొడ్డలి వస్తుందంటూ.. పరోక్షంగా సీఎం హత్యారాజకీయాల్ని ప్రోత్సాహిస్తున్నారని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఉయ్యూరులో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు నరకయాతన పడ్డారన్నారు. ఒక నాయకుడు మంచివాడైతే.. అక్కడ ప్రజలందరూ బాగుపడతారని సూచించారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ (TDP) అధికారంలో ఉన్నప్పుడు.. ముస్లింలకు ఎక్కడా అన్యాయం జరగలేదన్నారు. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది, కాపాడింది ఒక్క టీడీపీనే అని ఉద్ఘాటించారు. కానీ.. జగన్ మాత్రం ‘నా మైనారిటీ’ అంటూ మోసం చేశాడని తూర్పారపట్టారు.

చీరతో క్యాన్సర్ ముప్పు.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు


జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌ని (Pawan Kalyan) విమర్శిస్తే.. ఆయన ఫాలోవర్స్ జగన్ బొచ్చంతా పీకేస్తారని చంద్రబాబు హెచ్చరించారు. ఉయ్యూరులో ఉన్న వైసీపీ మంత్రి శవ రాజకీయాలు చేస్తున్నారని.. వైసీపీలో మంచి వారికి స్థానం లేదని అన్నారు. గుట్కా నాని, వంశీ, పేర్ని నాని లాంటి వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలేదనని పేర్కొన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని మరోసారి స్పష్టం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత హైదబాద్‌తో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాల్సిందని అన్నారు. రాష్ట్రంలో కనీసం గుంతలు పుడ్చలేని జగన్.. మూడు రాజధానులు ఎలా కడతాడని నిలదీశారు. డెల్టా ఆధునీకరణ చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పుకొచ్చారు.

YS Sharmila: వివేకా నిందితుల్ని కాపాడుతోంది జగనే.. షర్మిల సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌ని గంజాయికి కేంద్రంగా జగన్ మార్చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా గంజాయి, డ్రగ్స్ మీద సమీక్ష నిర్వహించలేదని చెప్పారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి సురక్షితమైన డ్రైవర్‌ని తానేనని తెలిపారు. ప్రతి ఏడాది మెగా డీఎస్సీ ఇస్తానని చెప్పి, జగన్ మాట తప్పాడని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా మెగా డీఎస్సీ పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నిరుద్యోగలుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, ఉయ్యూరులో అవసరమైతే హైటెక్ సిటీ లాంటి టవర్స్ కట్టిస్తానని చంద్రబాబు మాటిచ్చారు.

Updated Date - Apr 07 , 2024 | 10:19 PM