చీరతో క్యాన్సర్ ముప్పు.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు

చీర అనేది మన భారతీయ సంస్కృతితో ముడిపడి ఉంది. పూజలు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మహిళలు చీరలు ధరిస్తుంటారు. 

అయితే.. చీర కట్టుకునే విధానంతో మహిళలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యల బారిన పడుతున్నారని ఓ అధ్యయనం గుర్తించింది. 

ముంబైలోని ఓ ఆసుపత్రిలో నిర్వహించిన పరిశోధనల ద్వారా.. చీర కట్టుకోవడం వల్ల స్క్వామస్ సెల్ కార్సినోమా ముప్పు పెరుగుతోందని తేలింది.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఏడాది పొడవునా చీరలు ధరిస్తారని, దాంతో నడుముపై చీర కట్టిన గుర్తులుంటాయని నిపుణులు చెప్తున్నారు.

పెట్టికోట్ కాటన్ నాడాలని గట్టిగా కట్టుకోవడం వల్ల.. నడుము భాగంలో రాపిడి ఏర్పడి, నల్లని మచ్చలు క్యాన్సర్‌గా మారుతుందని అంటున్నారు.

68 ఏళ్ల మహిళ క్యాన్సర్ బారిన పడినప్పుడు పరిశీలించగా.. చీరల వల్ల ఆ సమస్య వచ్చిందన్ని షాకింగ్ విషయాన్ని వైద్యులు గుర్తించారు.

విపరీతమైన వేడిలో.. ముఖ్యంగా బిహార్, జార్ఖండ్‌లలో నివసించే మహిళల్లో ఈ క్యాన్సర్ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

చీర వల్లే కాదు.. కశ్మీరీ కంగ్రీ దుస్తులతో పాటు టైట్‌ జీన్స్‌ వేసుకున్నా కూడా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అయితే.. చీర ధరించిన వారందరికీ క్యాన్సర్ వస్తుందని కాదని, పరిశుభ్రత పాటించాలని, ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవద్దని సూచిస్తున్నారు.