Share News

Chandrababu: అమరావతిని నాశనం చేసిన జగన్‌

ABN , Publish Date - Apr 13 , 2024 | 08:44 PM

అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. శనివారం నాడు ప్రత్తిపాడులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu:  అమరావతిని నాశనం చేసిన జగన్‌

అమరావతి: జగన్‌ అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. శనివారం నాడు ప్రత్తిపాడులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లపాటు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి చెప్పేవన్ని అబద్ధాలు.. చేసేవన్ని మోసాలేనని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలు వన్‌సైడ్‌గానే జరుగుతాయన్నారు.


Balakrishna: నవరత్నాలతో మోసం చేసిన జగన్

తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మీ భవిష్యత్‌కు మాది భరోసా అని హామీ ఇచ్చారు. కోట్లు ఖర్చు పెట్టినా... జగన్‌ గుంటూరు సభ అట్టర్‌ ఫ్లాప్‌ అని ఎద్దేవా చేశారు. జగన్‌ బయల్దేరితే చాలు.. ఆ రోడ్డులో చెట్లన్నీ నరికేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజలపై కక్ష తీర్చుకునేందుకే జగన్‌ సీఎం అయినట్లు ఉందన్నారు. ఈ రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం తెస్తామని మాటిచ్చారు.


Nara Lokesh: నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా.. ఆఖరుకు ఆయన్నూ వదలలేదా..

ప్రజల జీవితాల్లో వెలుగులు తేవడం సీఎం బాధ్యత అని తెలిపారు. దేశంలో ఐటీ ఉండాలని చెప్పిన మొదటి రాజకీయనేతను తానేనని అన్నారు. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదన్నారు. అమరావతి చుట్టూ రింగ్‌ రోడ్డు వేద్దామని అనుకున్నానని చెప్పారు. తెనాలి, హనుమాన్‌ జంక్షన్‌, సత్తెనలపల్లి మీదుగా ORR వచ్చేదని వివరించారు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు విలువ తగ్గిపోయిందన్నారు. అమరావతి పూర్తయితే యువతకు లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. అమరావతే మన రాజధాని.. దీనికి తిరుగులేదని చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

Chandrababu: ఎన్నికలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

AP Election 2024: అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు: చంద్రబాబు

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 13 , 2024 | 08:49 PM