Share News

AP Politics: ఎన్నికల ముందు నారాయణకు బిగ్ రిలీఫ్

ABN , Publish Date - Mar 14 , 2024 | 08:08 PM

ఎన్నికల ముందు మాజీ మంత్రి నారాయణ(Narayana)కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. నారాయణ కేసును గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఆర్పీసీలోని సెక్షన్ 41ఏ నిబంధనలను పాటించాలని హైకోర్టు ఆదేశించింది. పొంగూరి కృష్ణప్రియ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

AP Politics: ఎన్నికల ముందు నారాయణకు బిగ్ రిలీఫ్

అమరావతి: ఎన్నికల ముందు మాజీ మంత్రి నారాయణ(Narayana)కు ఏపీ హైకోర్టు (AP High court) లో బిగ్ రిలీఫ్ లభించింది. నారాయణ కేసును గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. సీఆర్పీసీలోని సెక్షన్ 41ఏ నిబంధనలను ఏపీ పోలీసులు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. పొంగూరి కృష్ణప్రియ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోర్టులో నారాయణ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌పై సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.నారాయణ ప్రస్తుత ఎన్నికలల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ఆయనను ప్రచారం చేయనీయకుండా ఏపీ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు. నెల్లూరులోనే ఉన్నప్పటికీ పిటీషనర్ అందుబాటులో లేరని పోలీసులు అసత్యాలు చెబుతున్నారని న్యాయవాది అన్నారు. దీంతో నారాయణకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో నారాయణ అల్లుడు పునీత్‌కు కూడా హైకోర్టు ఊరటను ఇచ్చింది. 41ఏ నిబంధనలను పాటించాలని హైకోర్టు ఆదేశించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 08:11 PM