Share News

AP Govt: డీఎస్సీ 2024 షెడ్యూల్‌‌లో మార్పులు.. దిగొచ్చిన ఏపీ సర్కార్

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:22 PM

Andhrapradesh: డీఎస్సీ 2024 షెడ్యూల్‌ విషయంలో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. హైకోర్టు ఆదేశానుసారం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి హాల్ టికెట్లు జారీ అవుతాయని.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

AP Govt: డీఎస్సీ 2024 షెడ్యూల్‌‌లో మార్పులు.. దిగొచ్చిన ఏపీ సర్కార్

అమరావతి, మార్చి 12: డీఎస్సీ 2024 (DSC 2024) షెడ్యూల్‌ విషయంలో ఏపీ ప్రభుత్వం (AP Government) దిగొచ్చింది. హైకోర్టు (AP HighCourt) ఆదేశానుసారం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి హాల్ టికెట్లు జారీ అవుతాయని.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 14 రోజుల పాటు రెండు సెషన్స్‌లో పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

Aadhar Update: ఫ్రీ ఆధార్ అప్‌డేట్ విషయంలో గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

6100 మంది ఉపాధ్యాయుల నియామకం కోసం చేపట్టిన డీఎస్సీ 2024లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25 వరకు ఆన్‌లైన్‌లో సర్కార్ దరఖాస్తులను స్వీకరించింది. గత షెడ్యూల్ ప్రకారం ఈనెల 15 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో ఎదురైన న్యాయపరమైన చిక్కుల వల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ మార్పును డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నవారు గమనించాలని విజ్ఙప్తి చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు మధ్య సమయం ఇవ్వాలని న్యాయస్థానాలు సూచించడంతో షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. సెంటర్లు ఎంపిక చేసుకోవడానకి వెబ్ అప్షన్ల ద్వారా అభ్యర్ధులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

కాగా.. ఏడు మేనేజ్‌మెంట్ల పరిధిలో 6100 పోస్టులతో డీఎస్సీని గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఎస్‌ఈటీ - 2280 , స్కూల్ అసిస్టెంట్స్ - 2299, టీజీటీ - 1264, పీజీటీ - 215, ప్రిన్సిపల్స్ - 42 చొప్పున ఉద్యోగాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి...

Big Breaking: ఈనెల 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ బంద్

AP HighCourt: మాజీ మంత్రి నారాయణ అల్లుడికి హైకోర్ట్‌లో రిలీఫ్



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 12 , 2024 | 03:40 PM