Share News

AP News: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు

ABN , Publish Date - Jun 09 , 2024 | 09:05 PM

జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ప్రేమ వివాహానికి పెద్దలు అభ్యంతరం తెలపడంతో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని ములకలచెరువు మండలం దేవలచెరువు అడవుల్లో చోటుచేసుకుంది.

AP News: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు

అన్నమయ్య జిల్లా: జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ప్రేమ వివాహానికి పెద్దలు అభ్యంతరం తెలపడంతో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని ములకలచెరువు మండలం దేవలచెరువు అడవుల్లో చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఈ సంఘన జరిగినట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వారిని నరేంద్ర(24), రాణి (17) గా గుర్తించారు. గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు ప్రేమికులను మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో నరేంద్ర మదనపల్లిలో, రాణి తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Jun 09 , 2024 | 09:07 PM