Share News

POSTAL BALLOT : మార్పు కనిపిస్తోంది..!

ABN , Publish Date - May 08 , 2024 | 12:16 AM

పోలీసుల తీరులో మార్పు వస్తోంది. అనంతపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద మంగళవారం ఆంక్షలు పెట్టారు. సీఐలు తమ సిబ్బందిో ఉదయమే అక్కడికి చేరుకుని.. వైసీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న టెంటును తొలగించాలని సూచించారు. అక్కడ ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకున్నారు. టీడీపీ వాళ్లను కూడా పంపించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వైసీపీ నాయకుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి పోలీసులతో ..

POSTAL BALLOT : మార్పు కనిపిస్తోంది..!
MLA Ananta is questioning the police

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద ఆంక్షలు..

వైసీపీ టెంట్లను తొలగించిన పోలీసులు

అనంతపురం టౌన, మే 7: పోలీసుల తీరులో మార్పు వస్తోంది. అనంతపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద మంగళవారం ఆంక్షలు పెట్టారు. సీఐలు తమ సిబ్బందిో ఉదయమే అక్కడికి చేరుకుని.. వైసీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న టెంటును తొలగించాలని సూచించారు. అక్కడ ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకున్నారు. టీడీపీ వాళ్లను కూడా పంపించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వైసీపీ నాయకుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించారు. విషయం


తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అక్కడికి వచ్చి పోలీసులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేయడంతో అక్కడున్న టెంటు, ఫర్నీచర్‌ను తీసుకెళ్లారు. అధికార పార్టీవారు నాలుగు రోజులుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. కానీ డీజీపీ, డీఐజీ, డీఎస్పీపై వేటు పడటంతో పోలీసులలో మార్పు వచ్చిందని అక్కడున్నవారు చర్చించుకున్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 08 , 2024 | 12:16 AM